Viralvideo: కరోనా వెళ్లిపోలేదు.. మాస్కులు ధరించండి

మసోరీలోనే కాదు మరో పర్యాటక ప్రాంతమైన నైనితాల్‌లో ఇదే పరిస్థితి. 

Updated : 08 Jul 2021 19:11 IST

ముసోరీలోని కెంప్టీ జలపాతం వద్ద ఇదీ పరిస్థితి

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను సడలిస్తూ పలు రాష్ర్టాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటక కేంద్రాలు సందర్శకులతో నిండిపోతున్నాయి. ఇంటిపట్టునే ఉన్న ప్రజలు కాస్త ప్రకృతిని ఆస్వాదించేందుకు పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఆనందానికి లోనవుతుంటే... మాస్కు పెట్టుకోమని పదేపదే మొత్తుకుంటున్నా.. వాటిని పెడచెవిన పెడుతూ వస్తున్న పర్యాటకులను చూస్తే మళ్లీ కరోనా కలవరం మొదలవ్వక మానదు. ఉత్తరాఖండ్‌లోని ముసోరీ కొండ ప్రాంతాలు, కెంప్టీ జలపాతం ప్రముఖ పర్యాటకకేంద్రాలు. లాక్‌డౌన్‌ని సడలించడంతో అక్కడి హోటల్స్‌ నిండిపోయాయి.  ఇక ప్రజలు మాత్రం.. మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా జలపాతాల దగ్గర స్నానాలు చేస్తున్న ఓ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో ఆగ్రహించిన నెటిజన్లు మళ్లీ కొవిడ్‌ని కోరి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ముసోరీలోనే కాదు మరో పర్యాటక ప్రాంతమైన నైనితాల్‌లో ఇదే పరిస్థితి. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని