Puducherry: కరోనా టీకా వద్దంటూ చెట్టెక్కిన వ్యక్తి.. వీడియో వైరల్!
కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుందని.. టీకా వేసేందుకు వచ్చిన ఆరోగ్య సిబ్బంది నుంచి దూరంగా పారిపోయి
పుదుచ్చేరి: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుందని.. టీకా వేసేందుకు వచ్చిన ఆరోగ్య సిబ్బంది నుంచి దూరంగా పారిపోయి ఓ వ్యక్తి చెట్టెక్కిన ఘటన పుదుచ్చేరిలో జరిగింది. పుదుచ్చేరిలోని కోనేరికుప్పం గ్రామస్ధులకు వ్యాక్సిన్ అందించేందుకు ఆరోగ్య సిబ్బంది వచ్చారు. అయితే తనకు టీకా వద్దంటూ ముత్తువేల్ అనే వ్యక్తి చెట్టెక్కి కూర్చున్నారు. మద్యానికి బానిసైన ఆయన.. టీకా తీసుకుంటే మద్యం తాగకూడదన్న భయంతోనే ఇలా ప్రవర్తించాడని స్థానికులు చెబుతున్నారు. దీంతోఅతడిని సముదాయించేందుకు ఆరోగ్య సిబ్బంది అవస్థపడాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
► Read latest Viral Videos and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..