Viral Video: ఐస్‌తో ఎంజాయ్‌ చేస్తున్న ఎలుగు

వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి జంతువులు నీటిని ఆశ్రయిస్తాయి. కాసేపు చల్లని నీటిలో

Published : 10 Jul 2021 23:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి జంతువులు నీటిని ఆశ్రయిస్తాయి. కాసేపు చల్లని నీటిలో స్నానం చేసి శరీరాన్ని చల్లబరుచుకుంటాయి. ఆ విధంగానే ఓ ఎలుగుబంటి వేడి తాపాన్ని తట్టుకోలేక నీటి తొట్టెలోకి దిగింది. తొట్టెలో ఉన్న మంచు ముక్కతో ఆడుకుంటూ ఎంజాయ్‌ చేసింది. పశ్చిమ బెంగాల్‌ సిలిగురిలో బెంగాల్‌ సఫారి జూపార్క్‌లో ఉండే ఈ హిమాలయన్‌ ఎలుగుబంటి చల్లగా ఉండే వాతావరణాన్ని ఇష్టపడుతుంది. అందుకోసం పార్క్ సిబ్బంది నీటి తొట్టెలో మంచు ముక్కలను వేశారు. ఆ తొట్టెలో స్నానం చేస్తూ మంచు ముక్కతో కాసేపు ఆడుకుంది. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని