India Canada Row: ‘భారత్-కెనడా వివాదం.. అమెరికా తలదూర్చకపోవచ్చు’
India Canada Row: భారత్-కెనడా మధ్య నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఎవరివైపు మొగ్గుచూపుతుందోననే విషయం సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే, దీనిపై పలువురు కీలక వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్: భారత్, కెనడా మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఇబ్బందుల (India Canada Row)ను ఇప్పుడు ప్రపంచదేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై కీలక పాత్ర పోషిస్తూ ప్రపంచ ఆర్థిక వృద్ధికి బలమైన తోడ్పాటునందిస్తున్న భారత్ ఓవైపు.. సంపన్న దేశాల కూటమి జీ7లోని కెనడా (India Canada Row) మరోవైపు ఉండడంతో ఆయా దేశాలు ఈ విషయంపై ఆచితూచి స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా (USA) మొగ్గుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Biden)కు ఎన్నికల సమయంలో నిధులు సమకూర్చిన చార్లెస్ మైయర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన సిగ్నం గ్లోబల్ అడ్వైజర్స్ పేరిట ఓ రాజకీయ వ్యూహాల సంస్థను ఏర్పాటు చేశారు. దానికి ప్రస్తుతం ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
భారత్, కెనడా వివాదం (India Canada Row)లో వీలైనంత వరకు అమెరికా (USA) తలదూర్చే అవకాశం లేదని చార్లెస్ మైయర్స్ తెలిపారు. ప్రధాని మోదీ హయాంలో భారత్‌తో బలమైన సంబంధాలను నిర్మించుకోవడంలో అమెరికా ఎంతో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. తాజా వివాదంలో తలదూర్చి అగ్రరాజ్యం (USA) దాన్ని పాడు చేసుకునే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. పైగా చైనా ఆగడాలను అడ్డుకునే విషయంలో భారత్‌తో అమెరికా చాలా లోతైన సంబంధాలను కొనసాగిస్తోందని వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా వివాదం నుంచి అమెరికా (USA) దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
భారత్‌కు ఎప్పుడో ఆధారాలిచ్చాం: ట్రూడో
మరోవైపు ప్రస్తుత వివాదం (India Canada Row) విషయంలో కెనడాకు భారత్ సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం పిలుపునిచ్చారు. దర్యాప్తు కొనసాగడం, వాస్తవాలు వెలుగులోకి రావడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాము జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. మరోవైపు భారత్‌పై ట్రూడో ఆరోపణలు చేయడానికి ముందు ‘ఫైవ్ ఐస్’ కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు నిఘా వర్గాల సమాచారం అందిందని కెనడాలో అమెరికా రాయబారి డేవిడ్ కోహెన్ ధ్రువీకరించారు.
అలాగే పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ సైతం ఈ విషయం (India Canada Row)లో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రెండు మిత్రదేశాల విషయంలో అమెరికా ఏ ఒక్కరికో మద్దతుగా నిలుస్తుందని అనుకోవడం లేదని రూబిన్ అన్నారు. ఒకవేళ అలా ఎంచుకోవాల్సి వస్తే అమెరికా మొగ్గు భారత్ వైపే ఉంటుందని పేర్కొన్నారు. నిజ్జర్ ఒక ఉగ్రవాది అని అన్నారు. అమెరికాకు భారత్ చాలా ముఖ్యమైందన్నారు. కెనడా ప్రధాని హోదాలో జస్టిన్ ట్రూడో ఎక్కువకాలం కొనసాగకపోవచ్చునని అంచనా వేశారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కెనడాతో బంధాన్ని పునర్నిర్మించుకుంటామని చెప్పడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి..!
Israel-Hamas: ఒకవైపు బందీల విడుదల కొనసాగుతుండగా.. తమ చెరలో ఉన్న ఓ చిన్నారి మృతి చెందినట్లు హమాస్ వెల్లడించింది. -
పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు
నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర వెనుక భారతీయ వ్యక్తిపై తాజాగా అమెరికా(USA) అభియోగాలు మోపింది. -
Henry Kissinger: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ కన్నుమూత
Henry Kissinger: ప్రముఖ దౌత్య వేత్త అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన నోబెల్ బహుమతి గ్రహీత కూడా. -
జపాన్ సముద్రంలో కూలిన అమెరికా సైనిక విమానం
అమెరికా సైనిక విమానం బుధవారం జపాన్ సముద్రంలో యకుషిమా దీవి సమీపంలో కుప్పకూలింది. ఆ సమయంలో అందులో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు. -
ఇక హెచ్-1బీ వీసా పునరుద్ధరణ అమెరికాలోనే
అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు శుభవార్త. కొన్ని తరగతుల హెచ్-1బీ వీసాల పునరుద్ధరణకు ఇక స్వదేశం రానవసరం లేదు. -
పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో దూసుకెళ్లిన తొలి వాణిజ్య విమానం
సంప్రదాయ ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్(ఏటీఎఫ్)తో కాకుండా తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరించే పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో వర్జిన్ అట్లాంటిక్ విమానం నింగిలోకి దూసుకెళ్లింది. -
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
అమెరికాలో భారతీయ విద్యార్థి ఓం బ్రహ్మభట్ (23) తన తాత, అవ్వ, మామలను హత్య చేశాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
కాప్ సదస్సుకు గైర్హాజరుకానున్న బైడెన్
గురువారం నుంచి రెండు వారాలపాటు దుబాయిలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు హాజరవుతారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధికారులు మంగళవారం తెలిపారు. -
అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలి
పశ్చిమాసియా సంక్షోభాన్ని పరిష్కరించడానికి వెంటనే అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ కోరారు. -
ఉష్ణమండలీకరణతో సముద్రజీవుల వలస
వాతావరణ మార్పుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉష్ణమండల సముద్రజాతులు భూమధ్యరేఖ నుంచి ధ్రువాలవైపు కదులుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. -
ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ
క్రమశిక్షణ, నిబంధనల పేరిట చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడదు. తాజాగా ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ ఇస్తోంది. -
ఎన్నికల ముందు షరీఫ్‌కు ఊరట
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ (73)ను ఏవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో నిర్దోషిగా ఇస్లామాబాద్ హైకోర్టు బుధవారం ప్రకటించింది. -
నేపాల్‌లో తొలి స్వలింగ వివాహ నమోదు
నేపాల్‌లో తొలిసారిగా ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. లామ్‌జంగ్ జిల్లా డోర్డీ గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్‌జెండర్ మహిళ మాయా గురుంగ్ (35), గే సురేంద్ర పాండే (27)ల వివాహం బుధవారం చట్టబద్ధంగా రిజిస్టరైంది. -
81కి చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల సాఫీగా సాగిపోయింది. 5 రోజుల్లో మొత్తం 81 మంది బందీలను హమాస్, 180 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేశాయి. -
ఉక్రెయిన్ నిఘా అధిపతి భార్యపై విషప్రయోగం
ఉక్రెయిన్ గూఢచర్య విభాగం అధిపతి కిర్లో బుడనోవ్ భార్య మరియా బుడనోవ్‌పై విషప్రయోగం జరిగింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
-
Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
Cricket News: ఇప్పుడెందుకు ఈ టీ20 సిరీస్..? పందెం కోల్పోయానంటున్న కెవిన్.. టీమ్‌ఇండియాతోనూ బజ్‌బాల్!
-
TS Polling: ఓటేసేందుకు వచ్చి.. ఇద్దరు వృద్ధులు మృతి
-
Telangana assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. సినీ తారల ఫన్నీ మూమెంట్స్