భవిష్యత్తులో ట్రంప్‌ మళ్లీ అధ్యక్షుడు కావచ్చు.. బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

2020 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)కు, తన మధ్య నెలకొన్న పోటీని అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మరోసారి గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతారని వ్యాఖ్యానించారు.

Published : 10 Mar 2023 22:56 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ట్రంప్‌ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారేమోనని అన్నారు. పెన్సిల్వేనియా (Pennsylvania)లో బడ్జెట్‌ ప్రతిపాదన గురించి ప్రసంగించిన బైడెన్.. 2020 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తనకు, ట్రంప్‌ మధ్య నెలకొన్న తీవ్ర పోటీని మరోసారి గుర్తుచేసుకున్నారు. ‘‘అధ్యక్ష పదవి కోసం నేను మాజీ అధ్యక్షుడితో పోటీ పడిన సందర్భాన్ని మీరంతా భవిష్యత్తులో గుర్తుచేసుకుంటారు. డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావచ్చేమో’’ అని వ్యాఖ్యానించారు. బైడెన్‌ ప్రసంగంలో ట్రంప్‌ ప్రస్తావన వచ్చిన వెంటనే అక్కడున్న వారంత పెద్ద ఎత్తున ట్రంప్‌కు మద్దతుగా నినాదానాలు చేయడం గమనార్హం. 

2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను రిపబ్లికన్‌ పార్టీ తరఫున మరోసారి పోటీ చేయబోతున్నట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ అనుసరిస్తున్న విధానాల వల్ల అమెరికా ఒక విఫల దేశంగా మారిందని ఆయన విమర్శించారు. మరోవైపు, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు భారతీయ అమెరికన్లు వివేక్‌ రామస్వామి, నిక్కీ హేలీ సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. డెమోక్రటిక్‌ పార్టీ తరపున మరో భారతీయ అమెరికన్‌ రో ఖన్నా కూడా అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాలున్నాయని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ మరోసారి పోటీ చేయడం లేదంటూ వస్తోన్న వార్తలను ఆయన సతీమణి, ప్రథమ పౌరురాలు జిల్‌ బైడెన్‌ కొట్టిపారేశారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నికైన అమెరికా అధ్యక్షుల్లో బైడెన్‌ అత్యంత పెద్ద వయస్కుడు. 80 ఏళ్ల వయసులో బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన విషయం తెలిసిందే.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు