Erniebot: అబ్రకదబ్ర.. అంతే.. ఏం లేదు..!

మైక్రోసాఫ్ట్‌ రూపొందించిన చాట్‌ జీపీటికి పోటీగా చైనాకు చెందిన బైడు తయారుచేసిన ఎర్నీ బాట్‌ ప్రయోగం రివర్స్‌ కొట్టింది. లైవ్‌ డెమో లేకపోవడంతో బైడు షేర్లు కుంగడం గమనార్హం.

Updated : 16 Mar 2023 17:29 IST

బీజింగ్‌: చైనా (china) రాజధాని బీజింగ్‌ (Beijing)లోని ఒక ఆడిటోరియం... అతిథులు తీవ్ర ఉత్కంఠగా ఉన్నారు.. కారణం మైక్రోసాఫ్ట్‌ చాట్‌ జీపీటీకి పోటీగా చైనా సెర్చింజన్ బైడ్‌ తీసుకువచ్చిన కొత్త బాట్‌ను పరిచయం చేసే కార్యక్రమం... బైడు అధినేత రాబిన్‌ లీ స్టేజిపైకి వచ్చారు.. పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ మొదలు పెట్టారు. అయితే అందులో లైవ్‌ డెమో లేదు. దీంతో ఆడిటోరియంలో ఉన్న వారంతా నిరాశకు గురయ్యారు. ఈ ప్రదర్శనలతో కంపెనీ షేరు సైతం 6.4 శాతం నష్టపోయింది.

30 నిమిషాల ప్రసంగం.. ప్చ్‌

కంపెనీ సీఈవో రాబిన్‌ లీ దాదాపు 30 నిమిషాలు ప్రసంగించారు. కొత్త ఛాట్‌ బాట్‌ కోసం ఎంత కష్టపడ్డారో తెలిపారు. ఈ బాట్‌ పేరు ‘ఎర్ని బాట్‌’ అని వెల్లడించారు. ప్రసంగం ఆద్యంతం రికార్డ్‌ చేసిన కార్యక్రమాలను ప్రదర్శించారు. అయితే లైవ్‌ డెమో లేకపోవడంతో అది ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతానికి కొందరు ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని లీ చెప్పారు. కొంతకాలానికి అందరూ వినియోగించేందుకు వీలు కల్పిస్తామమన్నారు.

ఇప్పటికైతే పర్‌ఫెక్ట్‌ కాదు..

తమ బాట్‌ ఇప్పటికయితే పర్‌ఫెక్ట్‌ కాదని ఆయన అన్నారు. అయితే త్వరలోనే చాట్‌ జీపీటీకి పోటీగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.అయితే చైనాలో పలు విదేశీ వెబ్‌సైట్లపై నిషేధం ఉంది. దీంతో వీటి నుంచి సమాచారాన్ని తీసుకొని యూజర్‌కు ఇవ్వడంలో ఇబ్బందులున్నాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ బాట్‌ టెక్నాలజీని బైడు వినియోగిస్తున్న సెల్ఫ్‌డ్రైవింగ్‌, వీడియో ప్లాట్‌ఫారం తదితర సర్వీసుల్లో వినియోగించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని