అక్కడ ఏడిస్తే కూడా బిల్లేస్తారంటా...?

వైద్యుడిని సందర్శించిన సమయంలో ఏడ్చినందుకు ఒక మహిళ నుంచి 40 డాలర్లను వసూలు చేశారు. ప్రముఖ యూట్యూబర్‌, సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్‌గాఉండే అమెరికాకు చెందిన

Published : 20 May 2022 01:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వైద్యుడిని సందర్శించిన సమయంలో ఏడ్చినందుకు ఒక మహిళ నుంచి 40 డాలర్లను వసూలు చేశారు. ప్రముఖ యూట్యూబర్‌, సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్‌గా ఉండే అమెరికాకు చెందిన కామిల్లె జాన్సన్‌ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారిలా... ‘‘జనవరిలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నా సోదరిని ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడ వైద్యుడికి నా సోదరి అనారోగ్య పరిస్థితి వివరిస్తున్న క్రమంలో భావోద్వేగానికి గురై ఏడ్చాను’’. వైద్యం తరువాత వచ్చిన బిల్లును చూసి షాక్‌కి గురయ్యానని వెల్లడించారు. తన సోదరికి నిర్వహించిన ఆరోగ్య చికిత్సలకు సంబంధించిన బిల్లులో తను ఏడ్చినందుకు 40 డాలర్లు చెల్లించుకోవాల్సి వచ్చిందని వాపోయారు. నాన్నగారి ఆరోగ్య బీమా కింద బిల్లు చెల్లించాం కాబట్టి సరిపోయిందని సామాన్యుల పరిస్థితి ఏంటో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంబంధిత బిల్లును ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ట్విట్‌ చేసిన కొద్ది సేపటికే  ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని