Gautam Adani: ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలో గౌతమ్‌ అదానీ : ఫోర్బ్స్‌

ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయ సంపన్నుడు గౌతమ్‌ అదానీ (Gautam Adani) దూసుకుపోతున్నారు. ఫోర్బ్స్‌ (Forbes) సంపన్నుల జాబితాలో గౌతమ్‌ అదానీ నాలుగో స్థానానికి ఎగబాకారు.

Updated : 19 Jul 2022 14:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కుబేరుల జాబితాలో (Worlds Richest) భారతీయ సంపన్నుడు గౌతమ్‌ అదానీ (Gautam Adani) దూసుకుపోతున్నారు. ఫోర్బ్స్‌ (Forbes) సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను (Bill Gates) వెనక్కినెట్టిన అదానీ నాలుగో స్థానానికి ఎగబాకారు. 20బిలియన్‌ డాలర్లను గేట్స్‌ ఫౌండేషన్‌కు విరాళమిస్తున్నట్లు గేట్స్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఒక స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇలా క్రమంగా విరాళాలు పెంచుకుంటూ త్వరలోనే సంపన్నుల జాబితా నుంచి బయటకు వస్తానని బిల్‌గేట్స్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ ర్యాంకింగ్‌లో భారత సంపన్నుడు గౌతమ్‌ అదానీ (Gautam Adani) ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం కుటుంబీకులతో సహా ఆయన మొత్తం సంపద దాదాపు 114 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్‌ అంచనా వేసింది. ఐదో స్థానానికి చేరిన బిల్‌గేట్స్‌ సంపద 102 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ప్రపంచ కుబేరుల్లో టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) 230 బి.డాలర్లతో తొలిస్థానంలో కొనసాగుతున్నారు. బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ రెండోస్థానంలో ఉండగా, అమెజాన్‌ (Amazon) అధినేత జెఫ్‌ బెజోస్‌ మూడో స్థానంలో ఉన్నారు.

ఇక 114 బి.డాలర్ల సంపదతో గౌతమ్‌ అదానీ నాలుగో స్థానానికి చేరుకోగా.. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ (Mukesh Ambani) మాత్రం పదోస్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అంబానీ సంపద విలువ 88 బి.డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్‌ అంచనా వేసింది. మరోవైపు ఆసియాలో సంపన్నుడిగా కొనసాగిన ముకేశ్‌ అంబానీ స్థానాన్ని గౌతమ్‌ అదానీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆక్రమించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఏడాదిలోనే రికార్డు స్థాయిలో సంపద వృద్ధి చేసుకున్న వ్యక్తిగానూ గౌతమ్‌ అదానీ రికార్డు సృష్టించారు. కేవలం 2021 నుంచి ఇప్పటివరకే ఆయన సంపద రెట్టింపుకంటే ఎక్కువ కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు