భారత కాకస్‌ సహాధ్యక్షులుగా రో ఖన్నా, మైక్‌ వాల్ట్‌జ్‌ ఎన్నిక

అమెరికాలోని ప్రస్తుత 118వ కాంగ్రెస్‌ సభలో భారత్‌తోపాటు ఇండో అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన కాకస్‌ సహాధ్యక్షులుగా (కో-ఛైర్స్‌) ఇండో అమెరికన్‌ అయిన డెమోక్రటిక్‌ సభ్యుడు రో ఖన్నా (46), రిపబ్లిన్‌ హౌస్‌ సభ్యుడు మైక్‌ వాల్ట్‌జ్‌ ఎన్నికయ్యారు.

Published : 08 Feb 2023 04:50 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని ప్రస్తుత 118వ కాంగ్రెస్‌ సభలో భారత్‌తోపాటు ఇండో అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన కాకస్‌ సహాధ్యక్షులుగా (కో-ఛైర్స్‌) ఇండో అమెరికన్‌ అయిన డెమోక్రటిక్‌ సభ్యుడు రో ఖన్నా (46), రిపబ్లిన్‌ హౌస్‌ సభ్యుడు మైక్‌ వాల్ట్‌జ్‌ ఎన్నికయ్యారు. ఈ కాకస్‌ అమెరికా ప్రతినిధుల సభలో చట్టసభ సభ్యుల అతిపెద్ద ద్వైపాక్షిక కూటమి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌, అమెరికాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి ఇది కృషి చేస్తుంది. 1993లో మొదటిసారిగా ఏర్పడిన ఈ కాకస్‌కు ఇప్పటిదాకా సహాధ్యక్షుడిగా ఎన్నికైన రెండో ఇండో అమెరికన్‌ రో ఖన్నా. 115వ కాంగ్రెస్‌ సభలో (2015-16) ఇండో అమెరికన్‌ అమీ బేరా ఈ కాకస్‌కు సహాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ సభలో అయిదుగురు ఇండో అమెరికన్లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని