సరికొత్త క్షిపణిని ఆవిష్కరించిన ఇరాన్‌

ఇరాన్‌ గురువారం తన సరికొత్త బాలిస్టిక్‌ క్షిపణిని ఆవిష్కరించింది. ద్రవ ఇంధనంతో నడిచే ఖొర్రమ్‌షహర్‌ క్షిపణికి ఇది ఆధునిక వెర్షన్‌ అని పేర్కొంది.

Published : 26 May 2023 05:02 IST

టెహ్రాన్‌: ఇరాన్‌ గురువారం తన సరికొత్త బాలిస్టిక్‌ క్షిపణిని ఆవిష్కరించింది. ద్రవ ఇంధనంతో నడిచే ఖొర్రమ్‌షహర్‌ క్షిపణికి ఇది ఆధునిక వెర్షన్‌ అని పేర్కొంది. తన అణు కార్యక్రమంపై పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఇరాన్‌ చేపట్టిన తాజా చర్య ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. ఖొర్రమ్‌షహర్‌-4 అనే ఈ క్షిపణిని టెహ్రాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారులు విలేకరులకు ప్రదర్శించారు. చాలా స్వల్ప సమయంలోనే ఈ అస్త్రాన్ని ప్రయోగానికి సిద్ధం చేయవచ్చని రక్షణ మంత్రి జనరల్‌ మహ్మద్‌ రెజా అష్టియాని పేర్కొన్నారు. ఇది 2వేల కిలోమీటర్ల దూరం పయనించగలదని, 1500 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదని అధికారులు తెలిపారు. దీని ప్రయోగాత్మక పరీక్షకు సంబంధించిన వీడియోనూ వారు విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని