82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్‌ పాసినో.. గర్భం దాల్చిన 29 ఏళ్ల ప్రియురాలు

హాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రాలతో అభిమానులను సంపాదించుకున్న అల్‌ పాసినో ఎనిమిది పదుల వయసులో తండ్రి కాబోతున్నారు.

Updated : 01 Jun 2023 07:27 IST

లాస్‌ ఏంజిలెస్‌: హాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, ‘గాడ్‌ఫాదర్‌’ చిత్రాలతో అభిమానులను సంపాదించుకున్న అల్‌ పాసినో ఎనిమిది పదుల వయసులో తండ్రి కాబోతున్నారు. 82 ఏళ్ల అల్‌ పాసినో 29 ఏళ్ల నూర్‌ అల్ఫల్లాతో కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అల్‌ పాసినో ప్రతినిధి ఓ మేగజీన్‌కు తెలిపారు. నూర్‌ నిర్మాతగా కొనసాగుతున్నారు. అల్‌ పాసినోకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉన్నారు. నటన శిక్షకురాలు జాన్‌ టరంట్‌తో కుమార్తె జూలీ మేరీ(33), మాజీ ప్రియురాలు బెవెర్లీ డీఆంగెలోతో 22 ఏళ్ల కవలలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని