ఒకే తేదీన 9 మంది పుట్టినరోజు.. ఆ కుటుంబానికి గిన్నిస్‌ రికార్డు

పాకిస్థాన్‌లోని ఓ కుటుంబం పుట్టినరోజు వేడుకలు గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నాయి. ఈ కుటుంబంలోని తొమ్మిది మంది పుట్టినరోజు ఒకేతేదీన కావడంతో ఆ ఘనత దక్కింది.

Updated : 13 Jul 2023 08:30 IST

పాకిస్థాన్‌లోని ఓ కుటుంబం పుట్టినరోజు వేడుకలు గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నాయి. ఈ కుటుంబంలోని తొమ్మిది మంది పుట్టినరోజు ఒకేతేదీన కావడంతో ఆ ఘనత దక్కింది. సింధ్‌ ప్రావిన్సులోని లర్కానా నగరానికి చెందిన అమీర్‌ అలి, ఖదీజా దంపతులకు 1992 ఆగస్టు 1న మొదటిపాప పుట్టింది. తర్వాత వరుసగా ఆరుగురు సంతానం అదే తేదీన పుట్టడం విశేషం. ఇలా ఏడుగురు తోబుట్టువుల పుట్టినరోజు ఒకే తేదీన రాగా.. అమీర్‌, ఖదీజా దంపతుల పుట్టినరోజు, పెళ్లిరోజు సైతం అదే తేదీన కావడంతో.. ఆగస్టు 1 వచ్చిందంటే ఆ ఇంట్లో భారీ సంబరాలే. ఈ పాకిస్థానీ కుటుంబం ‘గిన్నిస్‌’ గుర్తింపు సాధించింది. గతంలో అమెరికాకు చెందిన కమిన్స్‌ కుటుంబం పేరిట ఫిబ్రవరి 20న పుట్టిన అయిదుగురు పిల్లలతో  ఈ గిన్నిస్‌ రికార్డు ఉండేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని