అరుణాచల్‌పై చైనా మళ్లీ పాత పాట

అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా మళ్లీ తన పాత రాగం అందుకొంది. ఆ ప్రాంతం తమ దేశంలో భాగమని పేర్కొంది.

Updated : 26 Mar 2024 05:32 IST

బీజింగ్‌: అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా మళ్లీ తన పాత రాగం అందుకొంది. ఆ ప్రాంతం తమ దేశంలో భాగమని పేర్కొంది. బీజింగ్‌ వాదన అసంబద్ధమంటూ భారత్‌ తోసిపుచ్చినప్పటికీ చైనా విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ సోమవారం తమ దేశ పాత వాదనను వినిపించారు. అరుణాచల్‌పై చైనా తరచూ చేసే వాదన హాస్యాస్పదం, ఆ రాష్ట్రం భారత్‌లో సహజ అంతర్భాగం అంటూ శనివారం భారత విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై జియాన్‌ ఈ మేరకు స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు