పాకిస్థాన్‌లో యోగా తరగతులు షురూ

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్‌లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది.

Published : 05 May 2024 04:51 IST

ఇస్లామాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్‌లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. ఇస్లామాబాద్‌ రాజధాని అభివృద్ధి సంస్థ(సీడీఏ) ఇక్కడి ఎఫ్‌-9 పార్క్‌లో ఉచిత యోగా తరగతులు ప్రారంభించింది. ఇప్పటికే చాలా మంది ఇందులో చేరినట్లు ఆ సంస్థ ఫేస్‌బుక్‌లో ప్రకటించింది. అలాగే స్థానికులు యోగా చేస్తున్న ఫొటోలు కూడా ఆ పోస్ట్‌లో పెట్టింది. సీడీఏ నిర్ణయాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని