రష్యా వాంటెడ్‌ జాబితాలో జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ పేరును రష్యా తమ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది.

Updated : 05 May 2024 06:14 IST

మాస్కో, కీవ్‌: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ పేరును రష్యా తమ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. వీరిద్దరిపై నేరాభియోగాలు ఏంటన్నది మాత్రం నిర్దిష్టంగా పేర్కొనలేదు. వారి పేర్లు కొన్ని నెలలుగా జాబితాలో ఉన్నప్పటికీ.. ఆ సంగతి ఇప్పుడే వెలుగులోకి వచ్చిందని రష్యా మీడియాలో వార్తలొచ్చాయి. ఇదే వాంటెడ్‌ జాబితాలో ఎస్తోనియా ప్రధానమంత్రి కాజా కలాస్‌ సహా నాటో సభ్యదేశాలకు చెందిన పలువురు శాసనకర్తలు, అధికారులు ఉన్నారు.

 రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని ఓ గ్రామంలో చోటుచేసుకున్న విధ్వంసం తాజాగా డ్రోన్‌ ఫుటేజీతో వెలుగులోకి వచ్చింది. దొనెట్స్క్‌ ప్రాంతంలోని ఒకెరెటైన్‌ అనే ఆ గ్రామంలో.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఆరంభానికి ముందు దాదాపు 3 వేలమంది నివసించేవారు. మాస్కో దాడుల తీవ్రతకు వారంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వలస బాట పట్టారు. 98 ఏళ్ల వృద్ధురాలు చేతికర్ర సాయంతో గతవారం సుమారు 10 కిలోమీటర్ల మేర నడిచి.. గ్రామాన్ని వీడటం ఫుటీజీలో కనిపించింది. ఒకెరెటైన్‌లో భవనాలు తిరిగి బాగు చేయలేనంతగా ధ్వంసమయ్యాయి. శివార్లలోని ఓ కర్మాగారం కూడా తీవ్రంగా దెబ్బతింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని