గాజా శాంతిచర్చల్లో పురోగతి!

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి.

Updated : 05 May 2024 05:55 IST

సానుకూలత ఉందన్న ఈజిప్టు మాధ్యమాలు

టెల్‌అవీవ్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. వివాదాస్పదమైన అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని ‘అల్‌ ఖహెరా న్యూస్‌’ శనివారం తెలిపింది. వాటి వివరాలేమిటనేది మాత్రం చెప్పలేదు. హమాస్‌ను నాశనం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోకుండా యుద్ధాన్ని విరమించడానికి ఇజ్రాయెల్‌ అంగీకరిస్తుందా అనేది కీలక ప్రశ్నగా నిలుస్తోంది. పాలస్తీనా పౌరుల్ని రఫా నగరం నుంచి ఖాళీ చేయించే ఆపరేషన్‌ గురించి అమెరికా ప్రభుత్వానికి ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని పూర్తిస్థాయిలో నిలుపుదల చేయించే అవకాశాల్లేవని ఇజ్రాయెల్‌ అధికారి ఒకరు చెబుతున్నారు. ఒప్పందం ఖరారు కోసం ఒత్తిడి పెరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని