బ్రిటన్‌ విమానాశ్రయాల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు..

బ్రిటన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి.

Updated : 09 May 2024 06:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి. ఫలితంగా ప్రధాన విమానాశ్రయాల్లో భారీగా ప్రయాణికులు బారులుతీరి గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా పాస్‌పోర్టు ఐటీ వ్యవస్థ కుప్పకూలడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. బ్రిటన్‌లో ఈ బోర్డర్‌ క్రాసింగ్‌ వ్యవస్థ పనిచేయకపోతే.. విమానాశ్రయాల్లోని ఈ-గేట్స్‌ తెరుచుకోవు.  .ఫలితంగా హీత్రూ తదితర పెద్ద విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రయాణికుల పత్రాల తనిఖీల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో.. చాలా విమానాల సేవలను రద్దు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని