Farideh Moradkhani: పాలనపై విమర్శలు.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మేనకోడలికి జైలు!

దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న మహిళల ఆందోళనలపై ఇరాన్‌(Iran) ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇదే వ్యవహారంలో తాజాగా దేశ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ(Ali Khamenei) మేనకోడలు ఫరీదే మొరాద్‌ఖనీకి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

Published : 11 Dec 2022 14:13 IST

టెహ్రాన్‌: దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న మహిళల ఆందోళనలపై ఇరాన్‌(Iran) ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇదే వ్యవహారంలో తాజాగా దేశ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ(Ali Khamenei) మేనకోడలు ఫరీదే మొరాద్‌ఖనీకి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. హిజాబ్‌ వ్యతిరేక నిరసనలకు మద్దతు తెలపడంతోపాటు పాలనను బహిరంగంగా విమర్శించారన్న అభియోగాలపై కోర్టులో ఆమె దోషిగా తేలినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మొరాద్‌ఖనీ(Farideh Moradkhani) చాలా కాలంగా ఇరాన్‌ పాలనను విమర్శిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నవంబరు 23న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

దేశంలోని న్యాయవ్యవస్థ నుంచి స్వతంత్రంగా ఉండే మతసంబంధిత కోర్టులో ఆమెపై విచారణ జరిగిందని, ఇది సుప్రీం నాయకుడికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని మొరద్‌ఖనీ తరఫు న్యాయవాది తెలిపారు. మొదట 15 ఏళ్ల జైలు శిక్ష విధించారని, అనంతరం అప్పీల్‌ చేసుకోగా.. మూడేళ్లకు కుదించినట్లు వెల్లడించారు. అంతకుముందు.. మొరాద్‌ఖనీ తల్లి, సుప్రీం నేత అలీ ఖమేనీ సోదరి బద్రీ హొస్సేనీ ఖమేనీ సైతం ఇరాన్‌ పాలనపై వ్యతిరేకతను ప్రకటించారు. దేశంలోని నిరసనలకు సంఘీభావం ప్రకటించారు. అలీ ఖమేనీతో తాము సంబంధాలన్నీ తెంచుకున్నామని, ఆయన తన పదవి నుంచి వైదొలగాలని ఓ బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని