Imran Khan: 12 కేసుల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు బెయిల్‌.. అయినా జైల్లోనే

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతోన్న తరుణంలో పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌(PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ఖాన్‌కు కాస్త ఊరట లభించింది.  

Published : 10 Feb 2024 16:02 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌(Imran Khan)కు 12 కేసుల్లో బెయిల్‌ మంజూరైంది. ఆయనతో పాటు విదేశాంగ శాఖ మాజీమంత్రి షా మహమ్మద్‌ ఖురేషీకి కూడా ఊరట లభించింది. ఈ కేసులలో నిందితులు అందరూ బెయిల్‌పై ఉన్నందున ఖాన్‌ను జైల్లో ఉంచడం సమర్థనీయం కాదని ఈసందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. గత ఏడాది మేలో మిలటరీ కార్యాలయాలపై దాడులకు సంబంధించి   ఈ కేసులు నమోదయ్యాయి.

కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ఇమ్రాన్‌ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. దీనికి కారణం ఆయనకు ఇప్పటికే పలు కేసుల్లో శిక్షలు పడటం. ఇదిలాఉంటే.. ఆయన బలపరిచిన అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకుంటున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఏడాది మేలో అవినీతి కేసులో ఇమ్రాన్‌ అరెస్టు కాగానే.. ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. మే 9న వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై ఇమ్రాన్‌ మద్దతుదారులు దాడులకు దిగి భవనాలను ధ్వంసం చేశారు. రావల్పిండిలోని ఆర్మీబేస్‌ క్యాంప్‌పైనా దాడి చేశారు. ఈ హింసాత్మక ఘటనలపై ఇమ్రాన్‌ సహా 100 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని