Mark Zuckerberg: ‘సారీ.. మీ బాధ ఎవరికీ రాకూడదు’: యూఎస్‌ సెనెట్‌ విచారణలో జుకర్‌బర్గ్‌

‘మీరు ఎదుర్కొన్న బాధ ఎవరికీ రాకూడదు’ అంటూ మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) సారీ చెప్పారు. 

Published : 01 Feb 2024 10:43 IST

వాషింగ్టన్‌: మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) క్షమాపణలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికల్లో చిన్నారుల భద్రత (Online Child Safety)పై యూఎస్ సెనెట్ విచారిస్తున్న సమయంలో మధ్యలో లేచి మన్నించాలని బాధిత కుటుంబాలను కోరారు.

సోషల్‌ మీడియా వల్ల చిన్నారులపై పడుతోన్న ప్రమాదకరమైన ప్రభావం కట్టడికి తగినన్ని చర్యలు తీసుకోవడం లేదంటూ చట్టసభ సభ్యులు జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెటాతో పాటు టిక్‌టాక్‌, ఎక్స్‌ (ట్విటర్‌), డిస్కార్డ్‌, స్నాప్‌చాట్ ప్రతినిధులు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. ‘మీ చేతులకు రక్తం అంటుకొని ఉంది’ అంటూ ఆ సంస్థలపై సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో మెటా సీఈఓ తన సీటు నుంచి లేచి బాధిత చిన్నారుల తల్లిదండ్రుల వైపు చూస్తూ విచారం వ్యక్తం చేశారు. ‘మీరు అనుభవించిన బాధ ఎవరికీ రాకూడదు’ అంటూ సారీ చెప్పారు.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా సంస్థలు మెటాకు చెందినవి. వాటిద్వారా టీనేజర్స్‌కు అపరిచితులు పంపే సందేశాలను బ్లాక్‌ చేస్తామని మెటా వెల్లడించింది. ఆ వేదికలపై ఆత్మహత్య, ఈటింగ్ డిజార్డర్‌ను చర్చించే సమాచారంపై ఆంక్షలను కఠినతరం చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని