Monterey Park: అమెరికా మాంటేరీ పార్క్‌లో కాల్పులు.. 10 మంది మృతి!

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌(los angeles)లో జరుగుతోన్న చైనీస్‌ లూనార్‌ న్యూఇయర్‌ వేడుకల్లో కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో 10 మందికిపైగా  మృతి చెందినట్లు సమాచారం.

Updated : 22 Jan 2023 15:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా(USA)లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. లాస్‌ఏంజెల్స్‌(los angeles) సమీపంలోని మాంటేరీ పార్క్‌(Monterey Park)లో శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. చైనీయుల లూనార్‌ న్యూఇయర్‌ ఫెస్టివల్‌ వేడుకలో ఈ ఘటన జరిగింది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం 10 మందికిపైగా ఈ ఘటనలో మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మరో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఇంకా గుర్తించలేదు. కాల్పులు జరిగిన సమయంలో అక్కడ వేల మంది ఉన్నారు. మాంటేరీ పార్క్‌ లాస్‌ ఏంజెల్స్‌కు కౌంటీ. ఇది ప్రధాన నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఓ వ్యక్తి భారీ మెషీన్‌ గన్‌తో అక్కడకు వచ్చి కాల్పులకు పాల్పడినట్లు లాస్‌ఏంజెల్స్‌ టైమ్స్‌ పేర్కొంది. ఘటన జరిగిన వీధిలోనే సియాంగ్‌ వాన్‌ చాయి అనే వ్యక్తి బార్బెక్యూ రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నాడు. రాత్రి ముగ్గురు వ్యక్తులు ప్రాణభయంతో అతడి రెస్టారెంట్లోకి వచ్చి తలుపులు వేసేశారని.. బయట ఓ వ్యక్తి గన్‌తో కాల్పులు జరుపుతున్నాడని వారు చెప్పినట్లు సియూంగ్‌ వెల్లడించాడు. ఆ సాయుధుడి వద్ద భారీగా మందుగుండు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. సమీపంలోని డ్యాన్సింగ్‌ క్లబ్‌ లక్ష్యంగా అతడు దాడి చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని