Russia-Ukraine: యుద్ధం ఒక ఉన్మాదం.. చర్చలతోనే పరిష్కారం: పోప్‌ ఫ్రాన్సిస్‌

ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ సరిహద్దుల్లో లక్షలాది మంది సైనికుల్ని రష్యా ప్రభుత్వం మోహరించింది. రష్యా కనుక యుద్ధం ప్రకటిస్తే.. అది మూడో ప్రపంచయుద్ధానికి దారి తీయొచ్చని పలువురు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అందుకే, ఇరు

Published : 10 Feb 2022 02:49 IST

రోమ్‌: ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ సరిహద్దుల్లో భారీ సంఖ్యలో సైనికుల్ని రష్యా ప్రభుత్వం మోహరించింది. మరోవైపు నాటో దేశాల సైనికులు కూడా భారీగా మోహరించింది. రష్యా కనుక యుద్ధం ప్రకటిస్తే.. అది మూడో ప్రపంచయుద్ధానికి దారి తీయొచ్చని పలువురు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అందుకే, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ యుద్ధ వాతావరణంపై ప్రపంచదేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో జర్మనీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫ్రాన్స్‌ అధినేత  ఇమాన్యుయెల్‌ మేక్రాన్‌ సోమవారం చర్చలు జరిపారు. తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ వివాదంపై పోప్‌ ఫ్రాన్సిస్‌ స్పందిస్తూ.. యుద్ధం వద్దని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు.

ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలని గత నెలలోనే పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి పోప్‌ తాజాగా ధన్యావాదాలు చెప్పారు. ‘‘రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ వాతావరణం తొలగిపోవాలని మనం చేస్తోన్న ప్రార్థనల్ని కొనసాగిద్దాం. ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చలతో సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్‌ ఈ మేరకు శాంతియుత చర్చలకు మధ్యవర్తిత్వం వహించడం మంచి విషయం. యుద్ధమనేది ఒక ఉన్మాదం అన్న విషయం మర్చిపోవద్దు’’అని పోప్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని