న్యూజెర్సీలోని బంగారుషాపులో చోరీ.. భారతీయ దుకాణాలు ఉండే ప్రాంతంలో ఘటన

అమెరికాలోని న్యూజెర్సీలో చోరీ జరిగింది. ఓ బంగారు నగల దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు సొత్తును ఎత్తుకెళ్లారు.

Updated : 11 Jun 2022 09:43 IST

న్యూజెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీలో సినీఫక్కీలో ఓ చోరీ జరిగింది. ఓ బంగారు నగల దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు సొత్తును ఎత్తుకెళ్లారు. న్యూజెర్సీలో భారతీయ దుకాణాలు ఎక్కువగా ఉండే ఓఎంజీ రోడ్‌లో ఉన్న ఓ దుకాణంలోకి ఎనిమిది మంది దుండగులు ప్రవేశించారు. అక్కడ ఉన్న వారిని తుపాకులు, కత్తులతో బెదిరించి చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు వేట కొనసాగుతోంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు