Tim Cook: భారత విద్యార్థుల్ని ప్రశంసించిన యాపిల్ సీఈఓ..!

ప్రముఖ దిగ్గజ సంస్థ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తమిళనాడు విద్యార్థుల్ని ప్రశంసించారు. ఆ రాష్ట్ర సంస్కృతిని ఐఫోన్‌లో 13 మినిలో బంధించిన ఆ 40 మంది చిన్నారుల గురించి తన ట్విటర్‌ ఖాతాలో ప్రస్తావించారు.

Published : 26 Mar 2022 23:55 IST

దిల్లీ: ప్రముఖ దిగ్గజ సంస్థ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తమిళనాడు విద్యార్థుల్ని ప్రశంసించారు. ఆ రాష్ట్ర సంస్కృతిని ఐఫోన్‌ 13 మినిలో బంధించిన ఆ 40 మంది చిన్నారుల గురించి తన ట్విటర్‌ ఖాతాలో ప్రస్తావించారు. వారు తీసిన చిత్రాలు ఇప్పుడు చెన్నైలోని ఎగ్మూర్‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ల్యాండ్‌ ఆఫ్‌ స్టోరీస్ పేరిట వాటిని వీక్షకులకు అందుబాటులో ఉంచారు. 

‘భారత్‌లోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన 40 మంది విద్యార్థులు ఐఫోన్ 13 మినిలో..  ఆ రాష్ట్ర సంపద, సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా ఫొటోలు తీశారు. వాటిని చెన్నైలోని ప్రఖ్యాత ఎగ్మూర్‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు’ అంటూ ట్వీట్ చేశారు. దాంతో పాటు కొన్ని చిత్రాలను షేర్ చేశారు. 

‘తమిళనాడు ఎన్నో కొత్త విషయాలకు నెలవు. విభిన్న వ్యక్తులు, ఆహారం, శిల్పకళ, ప్రకృతి అందాలను చిన్నారులు తమ దృష్టికోణం నుంచి చిత్రీకరించారు. వాటిని ఇక్కడ ప్రదర్శిస్తున్నాం’ అని నిర్వాహకులు వెల్లడించారు. రాష్ట్ర వారసత్వ సంపదను తమ చిత్రాల్లో బంధించాలంటూ కొన్ని నెలల క్రితమే వారు విద్యార్థుల్ని ఆహ్వానించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని