US Debt Ceiling: కుదిరిన ఒప్పందం.. అమెరికాకు తప్పిన దివాలా ముప్పు

అప్పుల పరిమితి పెంపుపై చిక్కుముడులతో దివాలా అంచున ఉన్న అమెరికా (USA)కు ఊరట లభించింది. గతకొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెకార్థీల మధ్య జరుగుతున్న సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. అమెరికా రుణ గరిష్ఠ పరిమితి పెంపుపై బైడెన్, మెకార్థిల మధ్య ఒప్పందం కుదిరింది. రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై సెనేట్‌లో డెమొక్రాట్లు, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు సూత్రప్రాయంగా ఒక ఒప్పందానికి వచ్చారు. 

Published : 29 May 2023 09:22 IST

మరిన్ని