Hyderabad: ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారా?.. మీ సెల్‌ఫోన్‌ జాగ్రత్త!

నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని దుండగులు సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడుతున్నారని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Published : 27 Apr 2024 10:21 IST

  ఈ మధ్య కాలంలో సెల్‌ఫోన్‌ చోరీలు తరచుగా జరుగుతున్నాయి. దొంగతనాలు చేయడానికి ప్రత్యేకంగా నిరుద్యోగులైన కొందరు యువకులను నియమించడం గమనార్హం! దాదాపు ఐదేళ్లుగా వ్యవస్థీకృతంగా ఈ సెల్‌ఫోన్ స్మగ్లింగ్ నెట్‌వర్క్ నడిపిస్తున్న 17 మందిని తాజాగా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఐదుగురు సూడాన్ దేశస్థులు ఉన్నారు. ఇదే ముఠా దొంగిలించిన ఐఫోన్లలోని విడిభాగాలను తక్కువ ధరకే విక్రయిస్తోంది. వారి నుంచి రూ.1.75 కోట్ల విలువైన 703 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  

Tags :

మరిన్ని