Hyderabad: రాయదుర్గం- శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేతకు సీఎం ఆదేశాలు

హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుపై ఆరా తీశారు. ఓఆర్‌ఆర్‌ వెంట జీవో 111 ప్రాంతంలో మెట్రో ఎలైన్‌మెంట్‌ను రూపొందించడంపై అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే అక్కడ ఓఆర్‌ఆర్‌ ఉన్న నేపథ్యంలో.. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఎయిర్‌పోర్టు మీదుగా ఎలైన్‌మెంట్‌ రూపొందించాలని ఆదేశించారు. 

Published : 14 Dec 2023 09:26 IST

Tags :

మరిన్ని