CPM - CPI: భాజపాపై కలిసి పోరాటం చేస్తాం: ఉభయ కమ్యూనిస్టు పార్టీల నిర్ణయం

తప్పుడు దారుల్లో అధికారం కోసం ఎత్తులు వేస్తున్న భాజపాను నిలువరించేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సీపీఎం(CPM), సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు తెలిపారు. భాజపా(BJP) ప్రమాదకర శక్తిగా మారిందని.. ఇదే కొనసాగితే దేశం విచ్ఛిన్నమవుతుందన్నారు. రాష్ట్రంలో ఆందోళనకు గురిచేస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సీపీఎం, సీపీఐ కలిసి సాగుతాయని ఇందులో భాగంగా ఈ నెల 9న ఎగ్జిబిషన్ మైదానంలో సమ్మేళనం నిర్వహించనున్నట్లు  తెలిపారు.

Updated : 04 Apr 2023 19:31 IST

Tags :

మరిన్ని