Goat Heads: రోడ్డుపై కుప్పలు కుప్పలుగా మేక కాళ్లు, తలకాయలు.. ఎగబడ్డ జనం!

ధరలు మండిపోతున్న వేళ ఫ్రీగా మాంసం దొరుకుతోందంటే.. అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇలాంటి ఓ ఘటనే మెదక్ (Medak) జిల్లాలో చోటుచేసుకుంది. నాగ్‌పుర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ లారీ తూప్రాన్ వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అందులో రవాణా చేస్తున్న మేక తలకాయలు, కాళ్లు (Goat heads) రోడ్డుపై కుప్పలుకుప్పలుగా పడిపోయాయి. వాటిని చూసిన జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. సంచుల్లో సర్దుకుని వెళ్లిపోయారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే లారీలోని తలకాయలు, కాళ్లు ఖాళీ అవటాన్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు.

Updated : 20 Apr 2023 17:32 IST

Tags :

మరిన్ని