TS News: భద్రాద్రి సీతమ్మకు కల్యాణం చీర సిద్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్‌ శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతమ్మవారికి కల్యాణం చీరను అందించనున్నారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకొని ఏటా చీరను రూపొందించి కానుకగా పంపిస్తారు. ఈసారి సీతారాముల ప్రతి రూపాలు, అంచుల్లో చీర మొత్తం శంఖుచక్ర నామాలు, జైశ్రీరామ్‌ అని వచ్చే విధంగా మగ్గంపై నేశారు. అయిదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పున్న దీని బరువు 800 గ్రాములు. రూ.60,000 ఖర్చు అయింది. రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి, పట్టు దారాలను తయారీలో ఉపయోగించారు. చీరకొంగులో సీతారాముల కల్యాణ బొమ్మ ఆకట్టుకుంటోంది. 

Published : 16 Apr 2024 12:18 IST

Tags :

మరిన్ని