ISRO: ఏడాది ఏదైనా ఇస్రో దూకుడు ఇదే..

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ దూసుకెళ్తోంది. కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించిన ఇస్రో (ISRO) రానున్న రోజుల్లో ఇదే దూకుడును ప్రదర్శించడానికి సిద్ధమయ్యింది. ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాలు, సాంకేతికత పరిజ్ఞానం కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్.. ఇప్పుడు సొంత టెక్నాలజీ, పరిశోధనలతో దూకుడు పెంచింది. వాణిజ్య పరంగా కూడా ఇస్రో చరిత్ర సృష్టిస్తోంది. 2040 నాటికి 40 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవడమే లక్ష్యంగా ఇస్రో పని చేస్తోంది. వీటితోపాటు 2035 నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్ ను అంతరిక్షంలో నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇలా ఎన్నో లక్ష్యాలతో.. నూతన సంవత్సరాన్ని ఎంతో ఉత్సాహంగా ప్రారంభించిన ఇస్రో.. పలు సవాళ్లను సైతం అధిగమించాల్సి ఉంది.

Updated : 01 Jan 2024 23:42 IST

Tags :

మరిన్ని