Delhi: శ్రద్ధా వాకర్ హత్య కేసులో కీలక పరిణామం

దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు (Shraddha Walker Murder Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా (Aftab Poonawala) హత్య, సాక్ష్యాల ధ్వంసం చేశాడని.. దిల్లీలోని సాకేత్ కోర్టు అభియోగాలను నమోదు చేసింది. అయితే, తాను నిర్దోషినని మరింత సమగ్రంగా విచారణ జరపాలని అఫ్తాబ్ కోరడంతో.. తదుపరి విచారణను అదనపు సెషన్స్ జడ్జి జూన్ 1కి వాయిదా వేశారు. గతేడాది మే 18న అఫ్తాబ్ పూనావాలా తన ప్రేయసి శ్రద్ధా వాకర్‌ను గొంతునులిమి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి దిల్లీలోని పలు ప్రాంతాల్లో పడేశాడు.

Published : 09 May 2023 19:49 IST

Tags :

మరిన్ని