Ap News: మహిళా వీఆర్‌ఏను మోసం చేసిన వైకాపా నేత..?

అధికార పార్టీ నాయకుడిగా చలామణీ అవుతూ ప్రజల్ని మభ్యపెట్టి ఆర్థిక నేరాలకు పాల్పడిన వైకాపా నాయకుడి బాగోతం బయటపడింది. వీఆర్‌ఏగా ఉన్న మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని. 30 లక్షల రూపాయలకుపైగా మోసానికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులపై ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. వత్సవాయి తహసీల్దారు కార్యాలయంలో. వీఆర్‌ఏగా పనిచేసిన చెన్నారపు సత్యనారాయణ సర్వీస్‌లో ఉండగానే 2019లో మృతి చెందారు. విజయవాడ సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్న ఆయన భార్య మల్లేశ్వరికి జగ్గయ్యపేటకు చెందిన వైకాపా సోషల్ మీడియా కార్యకర్త ఎర్రంశెట్టి ఆంజనేయులు వీఆర్‌ఏగా ఉద్యోగం ఇప్పించాడు. ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు పరిహారం రాగా లక్ష రూపాయలే వచ్చాయని నమ్మించి మిగతా సొమ్ము నొక్కేశాడు. 

Updated : 23 Mar 2023 14:12 IST

Tags :

మరిన్ని