YSRCP: వైకాపా ఎమ్మెల్యే కిరణ్ కుమార్‌కు నిరసన సెగ.. ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్ కుమార్‌( kiran kumar)కు ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. జి.సిగడాం మండలం మధుపాం పంచాయతీ నల్లిపేటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే(mla)కు సమస్యలు స్వాగతం పలికాయి. ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యేని సంక్షేమ పథకాలు అందడం లేదని, పథకాలు నిలిపేశారంటూ ప్రజలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఎన్నికల సమయంలో గ్రామస్తులందరూ ఐకమత్యంతో ఓటు వేసి గెలిపించినందుకు ఇదేనా బహుమానం అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇకపై మీ పార్టీలో ఉండబోమంటూ ముక్తకంఠంతో చెప్పేయడంతో.. ఎమ్మెల్యే సహా వైకాపా(ysrcp) ద్వితీయ శ్రేణి నాయకులు అవాక్కయ్యారు.

Updated : 28 Mar 2023 15:46 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు