Narendra Modi : టైగర్‌ రిజర్వును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలోని బండీపుర టైగర్‌ రిజర్వును సందర్శించారు. దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ఆస్వాదించారు. ఖాకీ ప్యాంట్‌, కామోఫ్లాజ్‌ టి-షర్ట్‌, స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించిన మోదీ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. అనంతరం తమిళనాడులో ముదుమలై టైగర్‌ రిజర్వును ఆయన పరిశీలించారు. ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్‌, బెల్లీలను కలిసి అభినందించడంతో పాటు అక్కడి ఏనుగులను పరిశీలించారు.

Updated : 09 Apr 2023 15:15 IST
1/15
భారతీయ చిత్రం ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్‌ విభాగంలో ఆస్కార్‌ పురస్కారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్‌, బెల్లీలను కలిశారు. వారి ఏనుగులను సైతం ఆయన పరిశీలించారు. భారతీయ చిత్రం ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్‌ విభాగంలో ఆస్కార్‌ పురస్కారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్‌, బెల్లీలను కలిశారు. వారి ఏనుగులను సైతం ఆయన పరిశీలించారు.
2/15
ముదుమలై టైగర్‌ రిజర్వులో నరేంద్ర మోదీ ముదుమలై టైగర్‌ రిజర్వులో నరేంద్ర మోదీ
3/15
4/15
5/15
6/15
7/15
8/15
కర్ణాటకలోని బండీపుర టైగర్‌ రిజర్వులో బైనాక్యూలర్‌తో వన్యప్రాణులను పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని బండీపుర టైగర్‌ రిజర్వులో బైనాక్యూలర్‌తో వన్యప్రాణులను పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని