News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (28-03-2023)

Updated : 28 Mar 2023 05:10 IST
1/17
 గుంటూరు నుంచి రాష్ట్ర సచివాలయం, హైకోర్టు వెళ్లే ప్రధాన రహదారి రాళ్లు తేలి పలుచోట్ల ఇలా దారుణంగా మారింది. నిత్యం గుంటూరు నుంచి వెళ్లే అధికారులు, ఉద్యోగులు, కక్షిదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వం మారాక నాలుగేళ్లుగా ఈ రహదారిని పట్టించుకున్న నాథుడే కరవయ్యారు.  

2/17
 అమరావతిలోని జాతీయ రహదారులపై పని చేసే సిబ్బంది ప్రాణాలంటే ఎంత నిర్లక్ష్యమో. ఒక్కో వ్యక్తికి ఒక కోన్‌ ఇచ్చి వారు పని చేసే ప్రదేశం వద్ద ఏర్పాటు చేసుకుని పనులు చేయాల్సిందే. జాతీయ రహదారిపై వేగంగా వచ్చే వాహనచోదకులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వీరి ప్రాణాలకు ప్రమాదమే కదా. వీరు పనిచేసే ప్రాంతానికి 300 నుంచి 500 మీటర్ల ముందు నుంచే పని జరుగుతోందని, నెమ్మదిగా వెళ్లాలని తెలిపే బోర్డులు సైతం కనీసం ఏర్పాటు చేయట్లేదు. ఒక మనిషి చేతికి ఎర్ర వస్త్రం కట్టిన కర్ర ఇచ్చి నిలబెడుతున్నారు.

3/17
   శ్రీకాకుళం  జిల్లాలోని అరసవల్లికి చెందిన సూక్ష్మ కళాకారుడు వాడాడ రాహుల్‌ పట్నాయక్‌ కోడి ఈకపై గీసిన శ్రీరాముడి పట్టాభిషేకం చిత్రం ఆకట్టుకుంది. శ్రీరామ నవమి సందర్భంగా నాలుగు అంగుళాల కోడి ఈకపై మూడు గంటల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని గీశానని ఆయన తెలిపారు.

4/17
 ‘జీ20’ సన్నాహక సదస్సుల నేపథ్యంలో   విశాఖపట్నం నగరంలో పలుప్రాంతాల్లో, కూడళ్లలో పాతమొక్కలు తీసేసి కొత్తవి నాటారు. మంగళవారం   నుంచి సదస్సులు ప్రారంభమవుతుండగా.. సోమవారం సాయంత్రం వరకూ పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే ప్రక్రియ పూర్తి కాలేదు. తెలుగుతల్లి పై వంతెన కింద ఆ మొక్కలను అలాగే ఉంచేశారు

5/17
  అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని అంతర్ల వద్ద అమర్య లిల్లీ పూలు ఆకట్టుకుంటున్నాయి. భారతీయ విద్యాకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజ్ఞానభారతి పాఠశాల ఆవరణలో ఇవి పెరుగుతున్నాయి. అలంకరణ కోసం వీటిని గార్డెనింగ్‌ ప్లాంట్స్‌గా పెంచుతున్నారు. మన్యంలోని వాతావరణం ఈ పూలసాగుకు అనుకూలమని, వీటిని అలంకరణ కోసం అధికంగా వినియోగిస్తారని చింతపల్లి ఉద్యాన 

6/17
   సాధారణంగా చల్లని గాలులు.. మబ్బుల పట్టిన వాతావరణంలో నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తాయి. సోమవారం ఉదయం అదే వాతావరణం ఉండడంతో కరీంనగర్‌ శివారు డెయిరీ పక్కన ఉన్న భూమిలో కొన్ని నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తుంటే బాటసారులు చూసి మురిసిపోయారు. పెద్ద ఈకలతో ఉండే మగ నెమళ్లు నాట్యం చేశాయి. 

7/17
   రెండు కాళ్లు కోల్పోయిన సునీతకు అండగా నిలుస్తున్నారు ఆమె భర్త కోటి. ఆమెకు ఉద్యోగం వచ్చి 18 ఏళ్లు గడిచాయి. ఐదేళ్ల క్రితం రక్తం గడ్డకట్టి ఇన్‌ఫెక్షన్‌ సోకటంతో ఆమె రెండు కాళ్లను వైద్యులు తొలగించారు. అప్పటి నుంచి భార్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు కోటి. డీఆర్డీఏలో కమ్యూనికేషన్‌ విభాగంలో సమన్వయకర్తగా పనిచేస్తున్న సునీతను ఉదయం ఆటోలో కలెక్టరేట్‌ వద్దకు తీసుకొస్తున్నారు. సాయంత్రం మళ్లీ ఆటోలో ఖమ్మం బల్లేపల్లిలోని ఇంటికి తీసుకెళ్తున్నారు

8/17
 శారీరక దృఢత్వాన్ని పెంచే క్రీడల్లో ఈత ఒకటి. ఒకవైపు పిల్లల సరదా తీరుస్తూనే మరోవైపు వారి శరీరానికి శక్తిని ఇస్తుంది. ఈ ఉద్దేశంతో సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్‌రావు చొరవతో యువజన క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్విమ్మింగ్‌ క్రీడా సంఘం అధ్యక్షుడు బర్ల మల్లికార్జున్‌ ఈత శిక్షణ ఏర్పాటు చేశారు. ఒంటి పూట బడులు కొనసాగుతున్నందున సాయంత్రం వేళ బాలలు 45 మందికి సంఘం కార్యదర్శి గుండి ప్రవీణ్‌ సిద్దిపేట స్టేడియం పక్కనున్న ఈత కొలనులో శిక్షణ ఇస్తున్నారు.

9/17
  యువతకు శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణ కోసం పల్లెల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రం.ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం మర్కగూడ పంచాయతీలో ఇలా రహదారిపైనే క్రీడాప్రాంగణ స్వాగత బోర్డుతోపాటు నిత్యం రాకపోకలు సాగించే మార్గంలోనే మొక్కుబడిగా పరికరాలు బిగించి వదిలేశారిలా.

10/17
  హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి శేషాద్రినగర్‌లోని పార్కు నాలా గోడ నిర్మాణ పనులు పూర్తి చేయకుండానే వదలేశారు. దీంతో నాలాలోకి చెత్తాచెదారం వచ్చి చేరుతోంది. వర్షాకాలంలో పారిశుద్ధ్యం దిగజారి, దుర్వాసన వస్తుండటంతో పాటు దోమలు విజృంభిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు నాలాను దాటేలా నిర్మించిన ఫలకకు ఇరువైపులా ఎలాంటి రక్షణ గోడ లేదు. వృద్ధులు, చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉంది.

11/17
 పెద్దపెద్ద పళ్లతో భారీగా కనిపిస్తున్న ఈ చేప నమూనాను   హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మెట్రో పార్కింగ్‌ వద్ద ఓ ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు ప్రధాన ద్వారంగా ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు ముగుస్తుండటం.. వేసవి సెలవుల సమీపిస్తుండటంతో పిల్లలను ఆకర్షించేలా దీన్ని రూపొందిస్తున్నారు.

12/17
  హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ తీరాన ఒక వైపు సచివాలయ నిర్మాణం అబ్బుర పరుస్తుండగా మరోవైపు ఆకాశహర్మ్యాలు, బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. సూర్యోదయ వేళ సాగర్‌ నీటిలో వాటి ప్రతిబింబాలు ఇలా ఆకట్టుకుంటున్నాయి. 

13/17
   హైదరాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నోటీసు బోర్డు దుస్థితి ఇది. సరైన నిర్వహణ లేకపోవడంతో చూడగానే చెత్తడబ్బాలా కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాల సమాచారం తెలియక   ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

14/17
ఎండల వేళ ప్రయాణికులకు చల్లదనం కల్పించేందుకు సికింద్రాబాద్‌లోని ఆటోవాలా మల్లేశ్‌ ప్రయత్నం ఇది. ఓ గోనెసంచిలో మట్టి నింపి ఆటోపై పచ్చిక పెంచుతున్నారు. మోండామార్కెట్‌లో మొలకలపై నీళ్లు చల్లుతూ కనిపించారిలా.

15/17
   హైదరాబాద్‌లో శ్రీరామ శోభాయాత్ర, సమావేశం జరిగే  హనుమాన్‌ వ్యాయామశాలలో ఏర్పాట్లను సోమవారం సంబంధిత ప్రతినిధులు,  అధికారులతో కలిసి నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడి మైదానంలో చిన్నారులతో కలిసి  సరదాగా క్రికెట్‌ ఆడారు. 

16/17
  పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో సోమవారం నేతాజీ భవన్‌ను సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. చిత్రంలో గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌

17/17
 ఆదిలాబాద్‌ పట్టణ శివారులోని చాందా వాగులో పెద్ద ఎత్తున గుర్రపు డెక్క పెరిగింది. వాటిలో విరబూసిన హైసింత్‌ పువ్వులు అందంగా కనిపిస్తున్నా.. అవి ప్రమాదకరంగా పరిణమించాయి. చేపలు పెరగకుండా, అనేక ఇతర సమస్యలకు కారణమవుతున్న ఈ గుర్రపుడెక్కను తొలగించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

మరిన్ని