News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 24 May 2022 19:55 IST
1/12
జపాన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ టోక్యోలోని అతిథి గృహం అకసక ప్యాలస్‌లో విందు ఆరగించారు. అంతకుముందు ఆయన 

ఆ దేశ ప్రధాని పుమియో కిషిదతో కలిసి చేపలకు ఆహారం వేశారు. జపాన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ టోక్యోలోని అతిథి గృహం అకసక ప్యాలస్‌లో విందు ఆరగించారు. అంతకుముందు ఆయన ఆ దేశ ప్రధాని పుమియో కిషిదతో కలిసి చేపలకు ఆహారం వేశారు.
2/12
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ విజేతలను దిల్లీలో ఘనంగా సత్కరించారు. స్వర్ణం సాధించిన నిఖత్‌ జరీన్‌, కాంస్య పతక విజేతలు 

మనీష, పర్వీన్‌ తమ పతకాలను ఇలా ప్రదర్శించారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ విజేతలను దిల్లీలో ఘనంగా సత్కరించారు. స్వర్ణం సాధించిన నిఖత్‌ జరీన్‌, కాంస్య పతక విజేతలు మనీష, పర్వీన్‌ తమ పతకాలను ఇలా ప్రదర్శించారు.
3/12
హైదరాబాద్‌ నగరంలోని గౌలిగూడ సీబీఎస్‌ బస్టాండ్‌ వద్ద  నిర్వహిస్తున్న కార్గో సర్వీసు కేంద్రానికి వినూత్నంగా ఆలోచించి ఇలా రంగులు 

వేశారు. దీంతో దారి వెంట వెళ్లే వారంతా ఈ ‘కదలని బస్సు’ను వింతగా చూస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలోని గౌలిగూడ సీబీఎస్‌ బస్టాండ్‌ వద్ద నిర్వహిస్తున్న కార్గో సర్వీసు కేంద్రానికి వినూత్నంగా ఆలోచించి ఇలా రంగులు వేశారు. దీంతో దారి వెంట వెళ్లే వారంతా ఈ ‘కదలని బస్సు’ను వింతగా చూస్తున్నారు.
4/12
‘కోనసీమ’ జిల్లా పేరు మార్పు చేయొద్దంటూ ఆ ప్రాంత యువకులు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోనసీమ 

జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్‌లో ఆందోళనకు దిగారు. 

‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ‘కోనసీమ’ జిల్లా పేరు మార్పు చేయొద్దంటూ ఆ ప్రాంత యువకులు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్‌లో ఆందోళనకు దిగారు. ‘కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
5/12
ఆదిలాబాద్‌ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఎన్టీఆర్‌ చౌక్‌ పరిసర ప్రాంతాల్లో సుమారు 9 సంవత్సరాల వయసున్న 

ఆరు చెట్లను తొలగించాల్సి వచ్చింది. అయితే పురపాలక ఛైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ ఆదేశాలతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 

ఏఈ అరుణ్, హరితహారం నీటి సరఫరా ఇన్‌ఛార్జి వెంకటేశ్ పర్యవేక్షణలో చెట్లను కాండంతో సహా యంత్రాల సహాయంతో తొలగించి 

ఆదిలాబాద్‌ పట్టణంలోకి వచ్చే ప్రధాన ద్వారం వద్ద వాటిని నాటారు. ప్రతి రోజూ నీరు పోసి ఈ చెట్లను కాపాడుతామని అధికారులు 

తెలిపారు. ఆదిలాబాద్‌ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఎన్టీఆర్‌ చౌక్‌ పరిసర ప్రాంతాల్లో సుమారు 9 సంవత్సరాల వయసున్న ఆరు చెట్లను తొలగించాల్సి వచ్చింది. అయితే పురపాలక ఛైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ ఆదేశాలతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఏఈ అరుణ్, హరితహారం నీటి సరఫరా ఇన్‌ఛార్జి వెంకటేశ్ పర్యవేక్షణలో చెట్లను కాండంతో సహా యంత్రాల సహాయంతో తొలగించి ఆదిలాబాద్‌ పట్టణంలోకి వచ్చే ప్రధాన ద్వారం వద్ద వాటిని నాటారు. ప్రతి రోజూ నీరు పోసి ఈ చెట్లను కాపాడుతామని అధికారులు తెలిపారు.
6/12
రూ.1.20 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని రోడ్డు రోలర్‌తో తొక్కించారు ఆదోని పోలీసులు. ఆదోని సబ్‌ డివిజన్‌ పరిధిలో వివిధ 

సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న మద్యం టెట్రా ప్యాకెట్లను ఇలా ధ్వంసం చేశారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడకు తరచూ 

ఆ రాష్ట్ర మద్యం అక్రమ రవాణా అవుతోంది. రూ.1.20 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని రోడ్డు రోలర్‌తో తొక్కించారు ఆదోని పోలీసులు. ఆదోని సబ్‌ డివిజన్‌ పరిధిలో వివిధ సందర్భాల్లో స్వాధీనం చేసుకున్న మద్యం టెట్రా ప్యాకెట్లను ఇలా ధ్వంసం చేశారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో ఇక్కడకు తరచూ ఆ రాష్ట్ర మద్యం అక్రమ రవాణా అవుతోంది.
7/12
8/12
ఈ చిత్రంలో కనిపిస్తోంది చిన్నారి కాదు.. యువకుడు. పేరు డోర్‌ బహదూర్‌ ఖపంగి. నేపాల్‌కు చెందిన ఈ యువకుడ్ని ప్రపంచంలోనే 

అతి చిన్న యువకుడి(జీవించి ఉన్నవారిలో)గా గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్‌ గుర్తించింది. ప్రస్తుతానికి ఇతని ఎత్తు 73.43 సెంటీమీటర్లు. అంటే 2 

అడుగుల 4.9 అంగుళాలు మాత్రమే. ఈ చిత్రంలో కనిపిస్తోంది చిన్నారి కాదు.. యువకుడు. పేరు డోర్‌ బహదూర్‌ ఖపంగి. నేపాల్‌కు చెందిన ఈ యువకుడ్ని ప్రపంచంలోనే అతి చిన్న యువకుడి(జీవించి ఉన్నవారిలో)గా గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్‌ గుర్తించింది. ప్రస్తుతానికి ఇతని ఎత్తు 73.43 సెంటీమీటర్లు. అంటే 2 అడుగుల 4.9 అంగుళాలు మాత్రమే.
9/12
నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ హాజరయ్యారు. 

యూనివర్సిటీ విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా పట్టాలు ప్రదానం చేశారు. నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ హాజరయ్యారు. యూనివర్సిటీ విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా పట్టాలు ప్రదానం చేశారు.
10/12
ఈ చిత్రంలోని పాఠశాల చిన్నారులు ఎందుకు బల్లల కింద దాక్కున్నారని ఆలోచిస్తున్నారా? వీరంతా అకస్మాత్తుగా భూకంపాలు, సునామీలు సంభవిస్తే ఎలా తమను తాము రక్షించుకోవాలో తెలుసుకొంటూ శిక్షణ పొందుతున్నారు. ఇండోనేసియాలోని బాలీ ప్రావిన్స్‌లో పాఠశాల విద్యలో భాగంగా చిన్నారులకు ఇలాంటి కృత్యాలు నేర్పిస్తున్నారు. ఈ చిత్రంలోని పాఠశాల చిన్నారులు ఎందుకు బల్లల కింద దాక్కున్నారని ఆలోచిస్తున్నారా? వీరంతా అకస్మాత్తుగా భూకంపాలు, సునామీలు సంభవిస్తే ఎలా తమను తాము రక్షించుకోవాలో తెలుసుకొంటూ శిక్షణ పొందుతున్నారు. ఇండోనేసియాలోని బాలీ ప్రావిన్స్‌లో పాఠశాల విద్యలో భాగంగా చిన్నారులకు ఇలాంటి కృత్యాలు నేర్పిస్తున్నారు.
11/12
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో రాకాసి అలలు భారీ కొండను బలంగా తాకుతూ ఎగిసి పడుతున్న దృశ్యాలు స్థానికులకు కనువిందు చేశాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో రాకాసి అలలు భారీ కొండను బలంగా తాకుతూ ఎగిసి పడుతున్న దృశ్యాలు స్థానికులకు కనువిందు చేశాయి.
12/12
టోక్యోలోని కంటెయ్‌ ప్యాలస్‌లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టోక్యోలోని కంటెయ్‌ ప్యాలస్‌లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

మరిన్ని