News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 2 (18-09-2022)

Updated : 18 Sep 2022 21:30 IST
1/22
త్వరలో టీ20 వరల్డ్‌కప్‌ ఆడనున్న భారత క్రికెటర్ల కోసం బీసీసీఐ నూతన జెర్సీని తీసుకువచ్చింది. బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసిన ఈ టీ20 జెర్సీ ఫొటో ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. త్వరలో టీ20 వరల్డ్‌కప్‌ ఆడనున్న భారత క్రికెటర్ల కోసం బీసీసీఐ నూతన జెర్సీని తీసుకువచ్చింది. బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసిన ఈ టీ20 జెర్సీ ఫొటో ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
2/22
హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు మార్గ్‌లో ఈట్‌ స్ట్రీట్‌ పక్కన అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో హైటెక్‌ నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఎయిర్‌ కండీషన్డ్‌ నీరా సెంటర్‌తో పాటు ఫుడ్‌ కోర్టులు అందుబాటులోకి తెస్తున్నారు. దసరాకు ప్రారంభిద్దామనుకుంటున్న ఈ నీరా దుకాణం ఎదుట ఆర్టీఫిషియల్‌ తాటి చెట్లకు తుది మెరుగులు దిద్దుతున్నారు. హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు మార్గ్‌లో ఈట్‌ స్ట్రీట్‌ పక్కన అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో హైటెక్‌ నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఎయిర్‌ కండీషన్డ్‌ నీరా సెంటర్‌తో పాటు ఫుడ్‌ కోర్టులు అందుబాటులోకి తెస్తున్నారు. దసరాకు ప్రారంభిద్దామనుకుంటున్న ఈ నీరా దుకాణం ఎదుట ఆర్టీఫిషియల్‌ తాటి చెట్లకు తుది మెరుగులు దిద్దుతున్నారు.
3/22
4/22
సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో ఆదివారం ‘నవరాత్రి ఉత్సవ్ 2022’ దాండియా ధమాల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు దాండియా ఆడుతూ సందడి చేశారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో ఆదివారం ‘నవరాత్రి ఉత్సవ్ 2022’ దాండియా ధమాల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు దాండియా ఆడుతూ సందడి చేశారు.
5/22
6/22
7/22
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన సురేశ్‌, అనిత దంపతులు 2013లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి ఉద్యమ సారథి, నేటి సీఎం కేసీఆర్‌తోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ పాపకు ఇప్పటి వరకు పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈక్రమంలో ఆదివారం సీఎం కేసీఆర్‌ దంపతులు.. సురేశ్‌, అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేళ్ల పాపకు ‘మహతి’ అని నామకరణం చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన సురేశ్‌, అనిత దంపతులు 2013లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తమ బిడ్డకు నాటి ఉద్యమ సారథి, నేటి సీఎం కేసీఆర్‌తోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ పాపకు ఇప్పటి వరకు పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈక్రమంలో ఆదివారం సీఎం కేసీఆర్‌ దంపతులు.. సురేశ్‌, అనిత దంపతులను దీవించి వారి తొమ్మిదేళ్ల పాపకు ‘మహతి’ అని నామకరణం చేశారు.
8/22
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భువనేశ్వర్‌కు చెందిన కళాకారిణి ప్రియాంక సహానీ బాదం పప్పులపై ప్రధాని జీవితంలో వివిధ దశలకు చెందిన చిత్రాలను తీర్చిదిద్ది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భువనేశ్వర్‌కు చెందిన కళాకారిణి ప్రియాంక సహానీ బాదం పప్పులపై ప్రధాని జీవితంలో వివిధ దశలకు చెందిన చిత్రాలను తీర్చిదిద్ది జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
9/22
10/22
11/22
భాగ్యనగరానికి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో దారి మధ్యలో వాహనాల టైర్ల గాలి దిగినా, పంక్చర్‌ అయినా పలువురు ఇబ్బందులు పడుతుంటారు. దీనికి కూకట్‌పల్లికి చెందిన మల్లేశ్‌ అనే డ్రైవర్‌ చక్కని ఉపాయం ఆలోచించాడు. రూ.2,600తో ఓ చిన్న పోర్టబుల్‌ గాలియంత్రాన్ని కొనుగోలు చేశాడు. ప్రయాణం మధ్యలో జూపార్కు వద్ద టైర్‌లో గాలి దిగగా.. తన వాహనంలోని ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పోర్టబుల్‌ యంత్రంతో గాలి నింపుతూ కనిపించాడు. భాగ్యనగరానికి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో దారి మధ్యలో వాహనాల టైర్ల గాలి దిగినా, పంక్చర్‌ అయినా పలువురు ఇబ్బందులు పడుతుంటారు. దీనికి కూకట్‌పల్లికి చెందిన మల్లేశ్‌ అనే డ్రైవర్‌ చక్కని ఉపాయం ఆలోచించాడు. రూ.2,600తో ఓ చిన్న పోర్టబుల్‌ గాలియంత్రాన్ని కొనుగోలు చేశాడు. ప్రయాణం మధ్యలో జూపార్కు వద్ద టైర్‌లో గాలి దిగగా.. తన వాహనంలోని ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పోర్టబుల్‌ యంత్రంతో గాలి నింపుతూ కనిపించాడు.
12/22
13/22
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం లండన్‌లోని లాన్సెస్టర్‌ హౌస్‌లో బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజబెత్‌2 మృతికి సంతాపంగా బుక్‌ ఆఫ్ కండోలెన్సెస్‌లో సంతకం చేసి నివాళి అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం లండన్‌లోని లాన్సెస్టర్‌ హౌస్‌లో బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజబెత్‌2 మృతికి సంతాపంగా బుక్‌ ఆఫ్ కండోలెన్సెస్‌లో సంతకం చేసి నివాళి అర్పించారు.
14/22
తైవాన్‌లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. దీంతో అక్కడి హువేలియన్‌ కౌంటీలో భారీ భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తైవాన్‌లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. దీంతో అక్కడి హువేలియన్‌ కౌంటీలో భారీ భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
15/22
హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌లో దసరా పండగ సందర్భంగా ముందస్తు నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోషలైట్‌ బినా మెహతా పలువురు మహిళలతో కలిసి గార్బా నృత్య ప్రదర్శన, దాండియా ఆటలు ఆడి సందడి చేశారు. హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌లో దసరా పండగ సందర్భంగా ముందస్తు నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోషలైట్‌ బినా మెహతా పలువురు మహిళలతో కలిసి గార్బా నృత్య ప్రదర్శన, దాండియా ఆటలు ఆడి సందడి చేశారు.
16/22
17/22
జపాన్‌లో నన్మడోల్‌ తుపాను రేగింది. దీంతో మియాజకి సముద్ర తీరంలో అలలు ఇలా ఎగిసిపడుతున్నాయి. తుపాను ప్రభావంతో భారీ గాలులు వీస్తాయని, విస్తారంగా వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణశాఖ అధికారులు ఇదివరకే హెచ్చరికలు జారీ చేశారు. 
జపాన్‌లో నన్మడోల్‌ తుపాను రేగింది. దీంతో మియాజకి సముద్ర తీరంలో అలలు ఇలా ఎగిసిపడుతున్నాయి. తుపాను ప్రభావంతో భారీ గాలులు వీస్తాయని, విస్తారంగా వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణశాఖ అధికారులు ఇదివరకే హెచ్చరికలు జారీ చేశారు.
18/22
19/22
లండన్‌ పార్లమెంటు కాంప్లెక్స్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ హాలులో రాణి ఎలిజబెత్-2 శవపేటిక ఉంచారు. పలువురు ఆ ప్రదేశానికి తరలివచ్చి రాణికి నివాళులర్పించారు. లండన్‌ పార్లమెంటు కాంప్లెక్స్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ హాలులో రాణి ఎలిజబెత్-2 శవపేటిక ఉంచారు. పలువురు ఆ ప్రదేశానికి తరలివచ్చి రాణికి నివాళులర్పించారు.
20/22

మరి కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో కొందరు యువతులు సంప్రదాయ గార్బా నృత్యం సాధన చేస్తూ కనిపించారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వీరంతా సన్నద్ధమవుతున్నారు.  మరి కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో కొందరు యువతులు సంప్రదాయ గార్బా నృత్యం సాధన చేస్తూ కనిపించారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వీరంతా సన్నద్ధమవుతున్నారు.
21/22
22/22

మరిన్ని