News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 2 (25-09-2022)

Updated : 25 Sep 2022 20:53 IST
1/20
ఉప్పల్‌లో జరుగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ను వీక్షిస్తూ సందడి చేసిన మంత్రి మల్లారెడ్డి, సినీ నటుడు వెంకటేశ్‌ ఉప్పల్‌లో జరుగుతున్న భారత్‌-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ను వీక్షిస్తూ సందడి చేసిన మంత్రి మల్లారెడ్డి, సినీ నటుడు వెంకటేశ్‌
2/20
3/20
సినీ నటుడు షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ సినిమాలో తన లుక్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ‘ఇది చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు’ అని తన చొక్కాతో మాట్లాడుతున్నట్లు ఫన్నీగా పోస్టు పెట్టారు. పఠాన్‌ సినిమా విడుదల కోసం తాను ఆసక్తిగా వేచి చూస్తున్నట్లు షారుఖ్‌ తెలిపారు. సినీ నటుడు షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ సినిమాలో తన లుక్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ‘ఇది చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు’ అని తన చొక్కాతో మాట్లాడుతున్నట్లు ఫన్నీగా పోస్టు పెట్టారు. పఠాన్‌ సినిమా విడుదల కోసం తాను ఆసక్తిగా వేచి చూస్తున్నట్లు షారుఖ్‌ తెలిపారు.
4/20
అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది ఘోస్ట్’. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల గ్రౌండ్‌లో జరగనున్న చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్ కోసం నాగార్జున, ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్‌, నటి సోనాల్‌ చౌహాన్‌ ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది ఘోస్ట్’. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల గ్రౌండ్‌లో జరగనున్న చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్ కోసం నాగార్జున, ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్‌, నటి సోనాల్‌ చౌహాన్‌ ప్రత్యేక విమానంలో బయలుదేరారు.
5/20
సినీనటుడు జగపతిబాబుకు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హెయిర్‌ స్టైల్‌ చేశారు. ఈ ఫొటోను జగపతిబాబు తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. యాక్షన్‌ కింగ్‌తో ఆదివారం యాక్షన్‌ అని పోస్టు పెట్టారు. సినీనటుడు జగపతిబాబుకు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హెయిర్‌ స్టైల్‌ చేశారు. ఈ ఫొటోను జగపతిబాబు తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. యాక్షన్‌ కింగ్‌తో ఆదివారం యాక్షన్‌ అని పోస్టు పెట్టారు.
6/20
మాజీ క్రికెటర్‌ సునీల్ గావస్కర్‌ ఖాజాగూడలో స్పర్శ హాస్పిస్‌ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్యాన్సర్‌ రోగులను ఆయన పరామర్శించారు. అనంతరం కేంద్రం నిర్వాహకులు సునీల్‌ గావస్కర్‌తో కేకు కోయించారు. మాజీ క్రికెటర్‌ సునీల్ గావస్కర్‌ ఖాజాగూడలో స్పర్శ హాస్పిస్‌ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్యాన్సర్‌ రోగులను ఆయన పరామర్శించారు. అనంతరం కేంద్రం నిర్వాహకులు సునీల్‌ గావస్కర్‌తో కేకు కోయించారు.
7/20
8/20
అమరావతి రైతుల మహాపాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. రాజధాని రైతులకు మద్దతునిస్తూ స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ రైతులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు పాల్గొన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. రాజధాని రైతులకు మద్దతునిస్తూ స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ రైతులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు పాల్గొన్నారు.
9/20
బాపట్ల జిల్లా బాపట్ల మండలం మురుకొండపాడు సమీపంలోని పొలాల్లో ఆదివారం వ్యవసాయ కూలీలు నాట్లు వేస్తున్నారు. అంతలోనే కారు వచ్చి ఆగింది.. వడివడిగా ఓ కుటుంబం పొలంలోకి దిగి వరినాట్లు వేయటం ప్రారంభించింది. వారిని గుర్తుపట్టిన కూలీలు ఆశ్చర్యపోయారు. ఇంతకీ వారెవరంటే ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయ కృష్ణన్‌ దంపతులు. పిల్లలతో సహా వచ్చిన వారు.. నాటు వేసిన అనంతరం గట్టుపై కూర్చొని భోజనం చేశారు. బాపట్ల జిల్లా బాపట్ల మండలం మురుకొండపాడు సమీపంలోని పొలాల్లో ఆదివారం వ్యవసాయ కూలీలు నాట్లు వేస్తున్నారు. అంతలోనే కారు వచ్చి ఆగింది.. వడివడిగా ఓ కుటుంబం పొలంలోకి దిగి వరినాట్లు వేయటం ప్రారంభించింది. వారిని గుర్తుపట్టిన కూలీలు ఆశ్చర్యపోయారు. ఇంతకీ వారెవరంటే ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దినేష్ కుమార్, విజయ కృష్ణన్‌ దంపతులు. పిల్లలతో సహా వచ్చిన వారు.. నాటు వేసిన అనంతరం గట్టుపై కూర్చొని భోజనం చేశారు.
10/20
11/20
బతుకమ్మ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది తంగేడు పువ్వు. ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ పండగ ఉండగా.. ఓ తూనీగ తంగేడు పూల నుంచి తేనె మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న దృశ్యాలు కూకట్‌పల్లిలోని రామాలయం ఆవరణలో కనువిందు చేశాయి. బతుకమ్మ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది తంగేడు పువ్వు. ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ పండగ ఉండగా.. ఓ తూనీగ తంగేడు పూల నుంచి తేనె మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న దృశ్యాలు కూకట్‌పల్లిలోని రామాలయం ఆవరణలో కనువిందు చేశాయి.
12/20
13/20
పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
14/20
గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెజస అధినేత కోదండరాం.. రాష్ట్ర సాధనలో అమరులైన వారి సంస్మరణార్థం బియ్యమిచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెజస అధినేత కోదండరాం.. రాష్ట్ర సాధనలో అమరులైన వారి సంస్మరణార్థం బియ్యమిచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు.
15/20
16/20
ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ నేపథ్యంలో అభిమానులు తరలివస్తున్నారు. ఆ పరిసరాల్లో ఓ క్రీడాభిమాని విచిత్ర వేషధారణతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మ్యాచ్‌ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ నేపథ్యంలో అభిమానులు తరలివస్తున్నారు. ఆ పరిసరాల్లో ఓ క్రీడాభిమాని విచిత్ర వేషధారణతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మ్యాచ్‌ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
17/20
18/20
19/20
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఫార్ములా-ఈ రేస్‌కు సంబంధించిన కార్లు హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నాయి. ప్రజల సందర్శనార్థం ఒక కారును దుర్గం చెరువు తీగల వంతెనపై ఏర్పాటు చేశారు. ఈ కార్లు 3 సెకన్లలోనే 62 కి.మీ. వేగాన్ని అందుకొని.. గరిష్ఠంగా గంటకు 280 కి.మీ. మేరకు ప్రయాణించగలవు. ఈవీ టెక్నాలజీతో నడిచే ఒక్కో కారు పొడవు 5160 ఎం.ఎం కాగా వెడల్పు 1770 ఎంఎం, ఎత్తు 1050 ఎంఎంతోపాటు 900 కిలోల బరువు ఉంటాయి. బ్యాటరీ బరువు 385 కిలోలు కాగా..200 కిలోవాట్ల శక్తి వీటి సొంతం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఫార్ములా-ఈ రేస్‌కు సంబంధించిన కార్లు హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నాయి. ప్రజల సందర్శనార్థం ఒక కారును దుర్గం చెరువు తీగల వంతెనపై ఏర్పాటు చేశారు. ఈ కార్లు 3 సెకన్లలోనే 62 కి.మీ. వేగాన్ని అందుకొని.. గరిష్ఠంగా గంటకు 280 కి.మీ. మేరకు ప్రయాణించగలవు. ఈవీ టెక్నాలజీతో నడిచే ఒక్కో కారు పొడవు 5160 ఎం.ఎం కాగా వెడల్పు 1770 ఎంఎం, ఎత్తు 1050 ఎంఎంతోపాటు 900 కిలోల బరువు ఉంటాయి. బ్యాటరీ బరువు 385 కిలోలు కాగా..200 కిలోవాట్ల శక్తి వీటి సొంతం.
20/20

మరిన్ని