News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 2 (03-10-22)

Updated : 03 Oct 2022 20:27 IST
1/26
అనంతపురంలోని బుక్కరాయ సముద్రం నుంచి నార్పల వెళ్లే రహదారిలో రైతులు సాగు చేస్తున్న బంతి తోటలో పూలు నిండుగా విరబూసి చూపరులకు కనువిందు చేస్తున్నాయి. అనంతపురంలోని బుక్కరాయ సముద్రం నుంచి నార్పల వెళ్లే రహదారిలో రైతులు సాగు చేస్తున్న బంతి తోటలో పూలు నిండుగా విరబూసి చూపరులకు కనువిందు చేస్తున్నాయి.
2/26
3/26
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీనివాసుడు.. చంద్రప్రభ వాహనంపై నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీనివాసుడు.. చంద్రప్రభ వాహనంపై నర్తనకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
4/26
5/26
6/26
సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నివాసంలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మను పేర్చారు. సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నివాసంలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మను పేర్చారు.
7/26
8/26
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ ఒడిశాలోని పూరీ తీరంలో కేసీఆర్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. తెరాస నేత అలిశెట్టి అరవింద్.. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సైకత శిల్పి సాహుతో ఈ శిల్పాన్ని రూపొందింపజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ ఒడిశాలోని పూరీ తీరంలో కేసీఆర్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. తెరాస నేత అలిశెట్టి అరవింద్.. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సైకత శిల్పి సాహుతో ఈ శిల్పాన్ని రూపొందింపజేశారు.
9/26
మిస్‌ ఎర్త్‌ ఇండియా-2019 తేజస్విని మనోజ్ఞ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి హరిత స్ఫూర్తి చాటారు. మిస్‌ ఎర్త్‌ ఇండియా-2019 తేజస్విని మనోజ్ఞ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి హరిత స్ఫూర్తి చాటారు.
10/26
11/26
ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అద్దాల మండపంలో వేద పండితులు గవర్నర్‌కు ఆశీర్వచనాలిచ్చారు. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అద్దాల మండపంలో వేద పండితులు గవర్నర్‌కు ఆశీర్వచనాలిచ్చారు.
12/26
13/26
నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో నిర్వహించిన దసరా వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో నిర్వహించిన దసరా వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పాల్గొన్నారు.
14/26
15/26
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని లక్ష్మీతాయారు అమ్మవారు సోమవారం వీరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని లక్ష్మీతాయారు అమ్మవారు సోమవారం వీరలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
16/26
కీరవాణి కుమారుడు శ్రీసింహా హీరోగా ఫణిదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్‌’. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను మంగళవారం సాయంత్రం 5.05గంటలకు ఇవ్వనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ ఆయుధపూజ రోజున ఉస్తాద్‌తో పాటు అతడి మిత్రుడిని కలవండి అంటూ పోస్టు పెట్టింది. కీరవాణి కుమారుడు శ్రీసింహా హీరోగా ఫణిదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్‌’. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను మంగళవారం సాయంత్రం 5.05గంటలకు ఇవ్వనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ ఆయుధపూజ రోజున ఉస్తాద్‌తో పాటు అతడి మిత్రుడిని కలవండి అంటూ పోస్టు పెట్టింది.
17/26
రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ తొలిసారి ఓ హిందీ పాటకు స్వరాలు సమకూర్చారు. అది కూడా సినిమాయేతర పాట. ‘ఓ పరి’ అంటూ సాగే ఆ గీతాన్ని మంగళవారం బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ఆవిష్కరించనున్నారు. 
రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ తొలిసారి ఓ హిందీ పాటకు స్వరాలు సమకూర్చారు. అది కూడా సినిమాయేతర పాట. ‘ఓ పరి’ అంటూ సాగే ఆ గీతాన్ని మంగళవారం బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ ఆవిష్కరించనున్నారు.
18/26
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గుజరాత్‌లో గాంధీజీ నివాసం ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె చరఖా తిప్పి నూలు వడికారు. ‘‘నేను గతంలో చరఖా తిప్పాను. కానీ, సబర్మతి ఆశ్రమంలో ఈ అనుభవం నా మనసును హత్తుకుంది. గాంధీజీ సిద్ధాంతాల్లోని అంతరార్థం తెలిసింది. అప్పటికీ.. ఇప్పటికీ ఎలాంటి మార్పులేని ఆశ్రమ పరిసరాలను చూస్తే ఆయన అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తోంది’’ అంటూ ట్విటర్లో తన అనుభూతిని పంచుకున్నారు. 
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గుజరాత్‌లో గాంధీజీ నివాసం ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె చరఖా తిప్పి నూలు వడికారు. ‘‘నేను గతంలో చరఖా తిప్పాను. కానీ, సబర్మతి ఆశ్రమంలో ఈ అనుభవం నా మనసును హత్తుకుంది. గాంధీజీ సిద్ధాంతాల్లోని అంతరార్థం తెలిసింది. అప్పటికీ.. ఇప్పటికీ ఎలాంటి మార్పులేని ఆశ్రమ పరిసరాలను చూస్తే ఆయన అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తోంది’’ అంటూ ట్విటర్లో తన అనుభూతిని పంచుకున్నారు.
19/26
కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు గుర్తుగా ఆయన విగ్రహాన్ని తన కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నారు టాలీవుడ్‌ నటుడు దగ్గుబాటి రానా. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. గతేడాది గుండెపోటుతో పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు గుర్తుగా ఆయన విగ్రహాన్ని తన కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నారు టాలీవుడ్‌ నటుడు దగ్గుబాటి రానా. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. గతేడాది గుండెపోటుతో పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే.
20/26
ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సాధించాలనే సంకల్పంతో రాజధాని రైతులు అరసవల్లి వరకు చేస్తున్న పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. ఇవాళ ఉదయం 9 గంటలకు దూబచర్లలో 22వ రోజు యాత్ర మొదలైంది. అక్కడ నుంచి పుల్లలపాడు-నల్లజర్ల-ప్రకాశరావుపాలెం వరకు నల్లజర్ల మండలంలో సాగుతోంది. దారి పొడవునా రైతులకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సాధించాలనే సంకల్పంతో రాజధాని రైతులు అరసవల్లి వరకు చేస్తున్న పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. ఇవాళ ఉదయం 9 గంటలకు దూబచర్లలో 22వ రోజు యాత్ర మొదలైంది. అక్కడ నుంచి పుల్లలపాడు-నల్లజర్ల-ప్రకాశరావుపాలెం వరకు నల్లజర్ల మండలంలో సాగుతోంది. దారి పొడవునా రైతులకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.
21/26
 ఈసీఐఎల్, ఏబీవీ ఫౌండేషన్‌లు సంయుక్తంగా ఓ అంబులెన్స్‌ను నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి వితరణ చేశాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ వాహనాన్ని ఆస్పత్రికి అందించారు. ఈసీఐఎల్, ఏబీవీ ఫౌండేషన్‌లు సంయుక్తంగా ఓ అంబులెన్స్‌ను నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి వితరణ చేశాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ వాహనాన్ని ఆస్పత్రికి అందించారు.
22/26
దసరా ఉత్సవాలలో ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ‘లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందింది. దుర్గమాసురుడిని సంహరించిన తర్వాత కీలాద్రిపై అమ్మవారు స్వయంగా ఆవిర్భవించింది. దుర్గే దుర్గతినాశని.. అనే వాక్యం శుభాలను కలగజేస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం’. దివ్యరూపిణి అయిన దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దసరా ఉత్సవాలలో ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ‘లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందింది. దుర్గమాసురుడిని సంహరించిన తర్వాత కీలాద్రిపై అమ్మవారు స్వయంగా ఆవిర్భవించింది. దుర్గే దుర్గతినాశని.. అనే వాక్యం శుభాలను కలగజేస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవిని దర్శించుకోవడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం’. దివ్యరూపిణి అయిన దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
23/26
24/26
25/26
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వాహన సేవలో మలయప్పస్వామిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వాహన సేవలో మలయప్పస్వామిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
26/26

మరిన్ని