News In Pics: చిత్రం చెప్పే సంగతులు -2 (07-10-2022)

Updated : 07 Oct 2022 22:11 IST
1/32
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ నూతన వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నటీమణులు అనీషా, చాందినీ చౌదరీ, డిజైనర్లు పాల్గొని సందడి చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ నూతన వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నటీమణులు అనీషా, చాందినీ చౌదరీ, డిజైనర్లు పాల్గొని సందడి చేశారు.
2/32
3/32
4/32
5/32
6/32
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల పూజల అనంతరం నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల పూజల అనంతరం నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేశారు.
7/32
8/32
9/32
కర్ణాటకలోని మైసూర్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ‘తలా’ ఫ్యాన్స్‌ ఈ విగ్రహానికి ఫిదా అవుతున్నారు. కర్ణాటకలోని మైసూర్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ‘తలా’ ఫ్యాన్స్‌ ఈ విగ్రహానికి ఫిదా అవుతున్నారు.
10/32
హైదరాబాద్‌లోని సోమాజీగూడలో నిర్వహించిన ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌లో సామాజిక సేవకురాలు పింకీరెడ్డి పాల్గొని సందడి చేశారు. ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల దుస్తులు, వస్తువులు, పెయింటింగ్స్‌ను ప్రదర్శనకు ఉంచారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడలో నిర్వహించిన ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌లో సామాజిక సేవకురాలు పింకీరెడ్డి పాల్గొని సందడి చేశారు. ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల దుస్తులు, వస్తువులు, పెయింటింగ్స్‌ను ప్రదర్శనకు ఉంచారు.
11/32
12/32
విశ్వక్‌సేన్‌, మిథిలా పాల్కర్‌, ఆశా భట్‌ ప్రధాన పాత్రల్లో అశ్వత్‌ మారి ముత్తు తెరకెక్కించిన చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నటీనటులు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. విశ్వక్‌సేన్‌, మిథిలా పాల్కర్‌, ఆశా భట్‌ ప్రధాన పాత్రల్లో అశ్వత్‌ మారి ముత్తు తెరకెక్కించిన చిత్రం ‘ఓరి దేవుడా’. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నటీనటులు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
13/32
14/32
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరీకరణతో నూతన భవంతులు వెలిసి హైదరాబాద్‌లోని చిన్న చిన్న కొండలు, గుట్టలు కనుమరుగవుతున్నాయి. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరిసరాల్లో కొండలు కనుమరుగు కాగా అలంకారప్రాయంగా మిగిలిన కొన్ని బండరాళ్లను చిత్రంలో చూడవచ్చు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరీకరణతో నూతన భవంతులు వెలిసి హైదరాబాద్‌లోని చిన్న చిన్న కొండలు, గుట్టలు కనుమరుగవుతున్నాయి. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరిసరాల్లో కొండలు కనుమరుగు కాగా అలంకారప్రాయంగా మిగిలిన కొన్ని బండరాళ్లను చిత్రంలో చూడవచ్చు.
15/32
గుజరాత్‌లోని మొదేరా గ్రామంలో ఇంటింటికీ సౌర పలకలు అమర్చుకున్నారు. ఈ గ్రామాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 9న భారతదేశ మొదటి సోలార్‌ పవర్డ్‌ విలేజ్‌గా ప్రకటించనున్నారు. అక్కడి ప్రభుత్వం చొరవతో మొదేరా సూర్య దేవాలయంతో పాటు గ్రామంలో పూర్తిగా సౌరపలకలు బిగించారు. ఆలయంలో ఈవీ ఛార్జింగ్‌ను సైతం ఏర్పాటు చేశారు. గుజరాత్‌లోని మొదేరా గ్రామంలో ఇంటింటికీ సౌర పలకలు అమర్చుకున్నారు. ఈ గ్రామాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 9న భారతదేశ మొదటి సోలార్‌ పవర్డ్‌ విలేజ్‌గా ప్రకటించనున్నారు. అక్కడి ప్రభుత్వం చొరవతో మొదేరా సూర్య దేవాలయంతో పాటు గ్రామంలో పూర్తిగా సౌరపలకలు బిగించారు. ఆలయంలో ఈవీ ఛార్జింగ్‌ను సైతం ఏర్పాటు చేశారు.
16/32
17/32
శిఖర్‌ ధావన్‌, సంజూ శాంసన్‌, రాహుల్ త్రిపాఠిలతో కలిసి విమానంలో దిగిన ఫొటోను శ్రేయస్‌ అయ్యర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. కాగా గురువారం లఖ్‌నవూలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ పరాజయం పాలైంది. ఈ నెల 9న రాంచీలో రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది. శిఖర్‌ ధావన్‌, సంజూ శాంసన్‌, రాహుల్ త్రిపాఠిలతో కలిసి విమానంలో దిగిన ఫొటోను శ్రేయస్‌ అయ్యర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. కాగా గురువారం లఖ్‌నవూలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ పరాజయం పాలైంది. ఈ నెల 9న రాంచీలో రెండో వన్డే మ్యాచ్‌ జరగనుంది.
18/32
తిరుమల శ్రీవారికి హర్ష టయోటా ఎండీ ఎం.హర్షవర్ధన్‌ టయోటా రైడర్‌ కారును విరాళంగా అందజేశారు. శుక్రవారం శ్రీవారి ఆలయం ఎదుట ఈవో ఎ.వి.ధర్మారెడ్డికి కారు తాళాలు అందజేశారు. తిరుమల శ్రీవారికి హర్ష టయోటా ఎండీ ఎం.హర్షవర్ధన్‌ టయోటా రైడర్‌ కారును విరాళంగా అందజేశారు. శుక్రవారం శ్రీవారి ఆలయం ఎదుట ఈవో ఎ.వి.ధర్మారెడ్డికి కారు తాళాలు అందజేశారు.
19/32
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని స్తర్యి-సాల్టివ్‌లో వంతెన ధ్వంసమైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే స్థానికులు, సైనికులు పడవల్లో సరకులు తెచ్చుకుంటున్నారు. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని స్తర్యి-సాల్టివ్‌లో వంతెన ధ్వంసమైంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే స్థానికులు, సైనికులు పడవల్లో సరకులు తెచ్చుకుంటున్నారు.
20/32
దక్షిణ కొరియాలోని సియోల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తైక్వాండో క్రీడాకారులు గాలిలో ప్లేట్లను పగులకొడుతూ అబ్బురపరిచే విన్యాసాలు చేశారు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తైక్వాండో క్రీడాకారులు గాలిలో ప్లేట్లను పగులకొడుతూ అబ్బురపరిచే విన్యాసాలు చేశారు.
21/32
22/32
23/32
అక్షయ్‌కుమార్‌, సత్యదేవ్‌ ప్రధాన పాత్రల్లో అభిషేక్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రామ్ సేతు’. ఫ్యాన్స్‌ తయారు చేసిన పోస్టర్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని చిత్రబృందం ఓ నూతన పోస్టర్‌ను విడుదల చేసింది. రామ్‌ సేతు ట్రైలర్‌ను ఈ నెల 11న విడుదల చేయనున్నారు. అక్టోబర్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్షయ్‌కుమార్‌, సత్యదేవ్‌ ప్రధాన పాత్రల్లో అభిషేక్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రామ్ సేతు’. ఫ్యాన్స్‌ తయారు చేసిన పోస్టర్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని చిత్రబృందం ఓ నూతన పోస్టర్‌ను విడుదల చేసింది. రామ్‌ సేతు ట్రైలర్‌ను ఈ నెల 11న విడుదల చేయనున్నారు. అక్టోబర్‌ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
24/32
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూకాంప్లెక్స్‌లు, షెడ్లు భక్తులతో నిండిపోవడంతో దర్శనానికి గంటలతరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూకాంప్లెక్స్‌లు, షెడ్లు భక్తులతో నిండిపోవడంతో దర్శనానికి గంటలతరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
25/32
26/32
నందిగామ నియోజకవర్గం కంచికచర్ల నుంచి పెద్దాపురం వెళ్లే రోడ్డు దుస్థితికి నిదర్శనం ఈ చిత్రాలు. అధ్వానంగా తయారైన ఈ మార్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జుజ్జూరు గ్రామంలో వరద నీరు ఇలా నిలిచిపోయింది. దీంతో అటుగా సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఆ నీటిలో దిగి తన సైకిల్‌ను శుభ్రం చేసుకున్నాడు. స్థానికులు ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. నందిగామ నియోజకవర్గం కంచికచర్ల నుంచి పెద్దాపురం వెళ్లే రోడ్డు దుస్థితికి నిదర్శనం ఈ చిత్రాలు. అధ్వానంగా తయారైన ఈ మార్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జుజ్జూరు గ్రామంలో వరద నీరు ఇలా నిలిచిపోయింది. దీంతో అటుగా సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి ఆ నీటిలో దిగి తన సైకిల్‌ను శుభ్రం చేసుకున్నాడు. స్థానికులు ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.
27/32
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని కొన్ని రోజులపాటు అట్టుడికించిన ఇయన్‌ హరికేన్‌ ఎట్టకేలకు శాంతించింది. దీంతో వివిధ పట్టణాలు, ఐలాండ్లలో తీవ్రంగా దెబ్బతిన్న నివాసాలు, కార్లు, బోట్లను బాధితులు మరమ్మతులు చేసుకుంటూ కనిపించారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని కొన్ని రోజులపాటు అట్టుడికించిన ఇయన్‌ హరికేన్‌ ఎట్టకేలకు శాంతించింది. దీంతో వివిధ పట్టణాలు, ఐలాండ్లలో తీవ్రంగా దెబ్బతిన్న నివాసాలు, కార్లు, బోట్లను బాధితులు మరమ్మతులు చేసుకుంటూ కనిపించారు.
28/32
29/32
30/32
హైదరాబాద్‌లోని హకీంపేటలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ 30వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బలగాలు ప్రదర్శించిన కవాతు ఆకట్టుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా ఈ కార్యక్రమంలో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్‌లోని హకీంపేటలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ 30వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బలగాలు ప్రదర్శించిన కవాతు ఆకట్టుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా ఈ కార్యక్రమంలో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు.
31/32
32/32

మరిన్ని

ap-districts
ts-districts