News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (06-12-2022)

Updated : 06 Dec 2022 19:45 IST
1/13
బ్రిటన్‌ కింగ్‌ ఛార్లెస్‌ 3 లూటన్‌లో నూతనంగా నిర్మించిన గురు నానక్‌ గురుద్వారాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సిక్కుల సంప్రదాయాలను గౌరవిస్తూ తలపాగా, కండువా ధరించి కాసేపు ప్రార్థనా మందిరంలోనే ఉన్నారు. 
బ్రిటన్‌ కింగ్‌ ఛార్లెస్‌ 3 లూటన్‌లో నూతనంగా నిర్మించిన గురు నానక్‌ గురుద్వారాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సిక్కుల సంప్రదాయాలను గౌరవిస్తూ తలపాగా, కండువా ధరించి కాసేపు ప్రార్థనా మందిరంలోనే ఉన్నారు.
2/13
ప్రఖ్యాత బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ధర్మకర్త మిలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో దిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాను రాసిన ‘ద మూమెంట్ ఆఫ్‌ లిఫ్ట్‌’ పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు.
ప్రఖ్యాత బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ధర్మకర్త మిలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో దిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాను రాసిన ‘ద మూమెంట్ ఆఫ్‌ లిఫ్ట్‌’ పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు.
3/13
గత రెండు సంవత్సరాలుగా గండికోట ప్రాజెక్టులో నీళ్లు పుష్కలంగా ఉండటంతో వలస పక్షులు ఇక్కడకు వస్తున్నాయి. కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు పొలాల వద్ద తల మీద నుంచి ముక్కు వరకు నల్లగా ఉండే ఈ (బ్లాక్‌ హెడ్‌ ఐబిస్‌) కొంగలు సందడి చేస్తున్నాయి. ఐయూసీఎన్‌ గణాంకాల ప్రకారం ఈ పక్షి జాతి అంతరించిపోయే జాబితాలో ఉన్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం అధ్యాపకులు డా.ఎ.మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. ఆసియా ఖండంలో మాత్రమే ఇవి మనుగడలో ఉన్నాయని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా గండికోట ప్రాజెక్టులో నీళ్లు పుష్కలంగా ఉండటంతో వలస పక్షులు ఇక్కడకు వస్తున్నాయి. కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు పొలాల వద్ద తల మీద నుంచి ముక్కు వరకు నల్లగా ఉండే ఈ (బ్లాక్‌ హెడ్‌ ఐబిస్‌) కొంగలు సందడి చేస్తున్నాయి. ఐయూసీఎన్‌ గణాంకాల ప్రకారం ఈ పక్షి జాతి అంతరించిపోయే జాబితాలో ఉన్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం అధ్యాపకులు డా.ఎ.మధుసూదన్‌ రెడ్డి తెలిపారు. ఆసియా ఖండంలో మాత్రమే ఇవి మనుగడలో ఉన్నాయని చెప్పారు.
4/13
టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. ఈ నెల 13న విక్టరీ వెంకటేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ‘నారప్ప’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో, ఇతర కారణాల వల్ల ఈ సినిమాను అప్పట్లో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. తాజాగా థియేటర్‌లో ఒక్క రోజు రీ రిలీజ్‌ చేస్తామని ప్రకటించడంతో వెంకీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. ఈ నెల 13న విక్టరీ వెంకటేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ‘నారప్ప’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో, ఇతర కారణాల వల్ల ఈ సినిమాను అప్పట్లో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. తాజాగా థియేటర్‌లో ఒక్క రోజు రీ రిలీజ్‌ చేస్తామని ప్రకటించడంతో వెంకీ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
5/13
మరి కొద్ది రోజుల్లో క్రిస్మస్‌ పండగ రానుంది. దీంతో పాశ్చాత్య దేశాల్లో సందడి మొదలైంది. జర్మనీలోని కుహార్ట్‌లో కొందరు ఔత్సాహికులు శాంటాక్లాజ్‌ల వేషధారణలో ఖరీదైన బైక్‌లపై ర్యాలీ చేస్తూ దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ యాత్ర చేపట్టారు. అలా వచ్చిన మొత్తాన్ని వ్యాధులబారిన పడిన చిన్నారుల కోసం వినియోగిస్తామని వెల్లడించారు. మరి కొద్ది రోజుల్లో క్రిస్మస్‌ పండగ రానుంది. దీంతో పాశ్చాత్య దేశాల్లో సందడి మొదలైంది. జర్మనీలోని కుహార్ట్‌లో కొందరు ఔత్సాహికులు శాంటాక్లాజ్‌ల వేషధారణలో ఖరీదైన బైక్‌లపై ర్యాలీ చేస్తూ దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ యాత్ర చేపట్టారు. అలా వచ్చిన మొత్తాన్ని వ్యాధులబారిన పడిన చిన్నారుల కోసం వినియోగిస్తామని వెల్లడించారు.
6/13
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైన నేపథ్యంలో రెండో వన్డే కోసం భారత ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1 -0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైన నేపథ్యంలో రెండో వన్డే కోసం భారత ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1 -0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.
7/13
ఈ చిత్రాల్లో కన్పిస్తున్నవి పెద్ద బాతులు. టిబెట్‌, మధ్య ఆసియా దేశాల నుంచి ఇవి చలికాలంలో భారతదేశానికి వలస వస్తుంటాయి. భారత్-పాక్‌ సరిహద్దులోని ఘరానా గ్రామం వద్ద ఇలా ఆహార వేట సాగిస్తూ సందడి చేస్తున్నాయి. ఈ చిత్రాల్లో కన్పిస్తున్నవి పెద్ద బాతులు. టిబెట్‌, మధ్య ఆసియా దేశాల నుంచి ఇవి చలికాలంలో భారతదేశానికి వలస వస్తుంటాయి. భారత్-పాక్‌ సరిహద్దులోని ఘరానా గ్రామం వద్ద ఇలా ఆహార వేట సాగిస్తూ సందడి చేస్తున్నాయి.
8/13
 హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ‘ఇండియన్‌ సిల్క్‌ గ్యాలరీ’ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రారంభించారు. నిర్వాహకులతో మాట్లాడి వివిధ చేనేత వస్త్రాల ప్రత్యేకతల గురించి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ‘ఇండియన్‌ సిల్క్‌ గ్యాలరీ’ని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రారంభించారు. నిర్వాహకులతో మాట్లాడి వివిధ చేనేత వస్త్రాల ప్రత్యేకతల గురించి తెలుసుకున్నారు.
9/13
గత కొన్ని రోజులుగా ఇండోనేసియాలోని మౌంట్‌ సెమేరు బూడిద, ఇతర వ్యర్థాలు వెదజల్లుతోంది. దాంతో ఆ అగ్నిపర్వతానికి సమీపంలోని ఓ ఇల్లు ఇలా బూడిదలో కూరుకుపోయింది. గత కొన్ని రోజులుగా ఇండోనేసియాలోని మౌంట్‌ సెమేరు బూడిద, ఇతర వ్యర్థాలు వెదజల్లుతోంది. దాంతో ఆ అగ్నిపర్వతానికి సమీపంలోని ఓ ఇల్లు ఇలా బూడిదలో కూరుకుపోయింది.
10/13
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్దనున్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్దనున్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల
11/13
రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్రమోదీ, స్పీకర్‌ ఓం బిర్లా తదితరులు రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్రమోదీ, స్పీకర్‌ ఓం బిర్లా తదితరులు
12/13
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని పద్మారావునగర్‌, హమాలీబస్తీల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఆయన ముందుకు సాగారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని పద్మారావునగర్‌, హమాలీబస్తీల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఆయన ముందుకు సాగారు.
13/13
తమ కుమార్తె శ్వేత వివాహానికి హాజరు కావాల్సిందిగా ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని దంపతులు తమ కుమార్తె శ్వేత వివాహానికి హాజరు కావాల్సిందిగా ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని దంపతులు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు