News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (25-05-2023)

Updated : 25 May 2023 21:57 IST
1/29
దక్షిణ కొరియా పోచెయోన్‌లోని సెయుంగ్‌జిన్‌ ఫైర్‌ ట్రైనింగ్ ఫీల్డ్‌లో మిలిటరీ బలగాలు ఫైర్‌ డ్రిల్‌ను నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆకాశంలో డ్రోన్‌లు ఇలా వరుస క్రమంలో కనిపించాయి. దక్షిణ కొరియా పోచెయోన్‌లోని సెయుంగ్‌జిన్‌ ఫైర్‌ ట్రైనింగ్ ఫీల్డ్‌లో మిలిటరీ బలగాలు ఫైర్‌ డ్రిల్‌ను నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆకాశంలో డ్రోన్‌లు ఇలా వరుస క్రమంలో కనిపించాయి.
2/29
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా క్వాలిఫయర్2 కోసం ముంబయి, గుజరాత్‌ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో శుక్రవారం మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా  నెహ్రా, రోహిత్‌ శర్మ ఇలా నవ్వుతూ ముచ్చటించుకుంటున్న ఫొటోను గుజరాత్‌ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది.  ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా క్వాలిఫయర్2 కోసం ముంబయి, గుజరాత్‌ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో శుక్రవారం మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా నెహ్రా, రోహిత్‌ శర్మ ఇలా నవ్వుతూ ముచ్చటించుకుంటున్న ఫొటోను గుజరాత్‌ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
3/29
తిరుపతిలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భీకర వర్షం కురిసిసంది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తిరుపతిలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భీకర వర్షం కురిసిసంది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
4/29
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు లిటన్‌ దాస్‌ వివిధ రకాల వంటకాలతో దిగిన ఈ ఫొటోను కేకేఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘జమాయ్‌ సోష్టి పండగ ప్రత్యేకం ఇది’ అని ట్వీట్‌ చేసింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు లిటన్‌ దాస్‌ వివిధ రకాల వంటకాలతో దిగిన ఈ ఫొటోను కేకేఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘జమాయ్‌ సోష్టి పండగ ప్రత్యేకం ఇది’ అని ట్వీట్‌ చేసింది.
5/29
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఇరాన్‌లోని హజ్రత్‌ అలీ మజర్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఇరాన్‌లోని హజ్రత్‌ అలీ మజర్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
6/29
సియర్రా లియోన్‌లోని ఫ్రీ టౌన్ డౌన్‌టౌన్‌లో కుండపోత వర్షాలకు వందల ఏళ్ల నాటి ఓ మహా వృక్షం (కాటన్ ట్రీ) నేల కూలింది. దీంతో రోడ్డుకు అడ్డంగా ఉందని ఈ చెట్టును తొలగించారు. ఈ చెట్టును ఆ దేశ స్వేచ్ఛకు చిహ్నంగా భావిస్తారు. ‘ఓ జ్ఞాపకం మా హృదయాలను వీడిపోయింది’ అని ఆ దేశాధ్యక్షుడు జూలియస్‌ మాడా బయో విచారం వ్యక్తం చేశారు. సియర్రా లియోన్‌లోని ఫ్రీ టౌన్ డౌన్‌టౌన్‌లో కుండపోత వర్షాలకు వందల ఏళ్ల నాటి ఓ మహా వృక్షం (కాటన్ ట్రీ) నేల కూలింది. దీంతో రోడ్డుకు అడ్డంగా ఉందని ఈ చెట్టును తొలగించారు. ఈ చెట్టును ఆ దేశ స్వేచ్ఛకు చిహ్నంగా భావిస్తారు. ‘ఓ జ్ఞాపకం మా హృదయాలను వీడిపోయింది’ అని ఆ దేశాధ్యక్షుడు జూలియస్‌ మాడా బయో విచారం వ్యక్తం చేశారు.
7/29
మెక్సికోలోని పొపొకేట్‌పెటిల్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో పెద్ద ఎత్తున బూడిద, పొగ, లావా వెలువడుతోంది. మెక్సికోలోని పొపొకేట్‌పెటిల్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో పెద్ద ఎత్తున బూడిద, పొగ, లావా వెలువడుతోంది.
8/29
జమ్ములో తితిదే నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహా సంప్రోక్షణకు సీఎం జగన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు తితిదే ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌కు ఆహ్వాన పత్రాన్ని అందించారు. జమ్ములో తితిదే నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహా సంప్రోక్షణకు సీఎం జగన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు తితిదే ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌కు ఆహ్వాన పత్రాన్ని అందించారు.
9/29
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని బాలల సత్వర చికిత్సా కేంద్రాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. గోడలపై వేసిన వివిధ రకాల రంగుల చిత్రాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని బాలల సత్వర చికిత్సా కేంద్రాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. గోడలపై వేసిన వివిధ రకాల రంగుల చిత్రాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
10/29
టీమిండియా కొత్త ట్రైనింగ్‌ కిట్‌ను నేడు ప్రారంభించారు. దీంతో పాటు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. రాహుల్‌ ద్రవిడ్‌, ఉమేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. టీమిండియా కొత్త ట్రైనింగ్‌ కిట్‌ను నేడు ప్రారంభించారు. దీంతో పాటు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. రాహుల్‌ ద్రవిడ్‌, ఉమేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
11/29
దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ ముంబయిలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దిల్లీలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాటం విషయంలో వారు చర్చించుకున్నారు. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ ముంబయిలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దిల్లీలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాటం విషయంలో వారు చర్చించుకున్నారు.
12/29
ఫ్రాన్స్‌లో నిర్వహిస్తున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌ నటులు సన్నీలియోన్‌, అనురాగ్‌ కశ్యప్‌ ఇలా మెరిశారు. ఫ్రాన్స్‌లో నిర్వహిస్తున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌ నటులు సన్నీలియోన్‌, అనురాగ్‌ కశ్యప్‌ ఇలా మెరిశారు.
13/29
సిరియాలో ‘డమాస్సీన్‌ రోజ్‌ హార్వెస్ట్‌’ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు బషర్‌ అస్సాద్‌ సతీమణి, సిరియా ప్రథమ మహిళ అస్మా అస్సాద్‌, అధికారులు క్వాలమౌన్‌ పర్వత ప్రాంతంలోని అల్‌మరాహ్‌ గ్రామంలో ఇలా పూలను చల్లుతూ వేడుక చేసుకున్నారు. సిరియాలో ‘డమాస్సీన్‌ రోజ్‌ హార్వెస్ట్‌’ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు బషర్‌ అస్సాద్‌ సతీమణి, సిరియా ప్రథమ మహిళ అస్మా అస్సాద్‌, అధికారులు క్వాలమౌన్‌ పర్వత ప్రాంతంలోని అల్‌మరాహ్‌ గ్రామంలో ఇలా పూలను చల్లుతూ వేడుక చేసుకున్నారు.
14/29
చెన్నై జట్టు ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జట్టు సభ్యుడు బ్రావో.. ఆటగాడు మతీశా పతిరాణ ఇలా సంబరపడుతున్న ఫొటోను సీఎస్‌కే తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘ మమ్మల్ని ముందుకు నెట్టండి.. ఛాంపియన్‌’ అని ట్వీట్‌ చేసింది. చెన్నై జట్టు ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జట్టు సభ్యుడు బ్రావో.. ఆటగాడు మతీశా పతిరాణ ఇలా సంబరపడుతున్న ఫొటోను సీఎస్‌కే తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘ మమ్మల్ని ముందుకు నెట్టండి.. ఛాంపియన్‌’ అని ట్వీట్‌ చేసింది.
15/29
ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌ నుంచి దిల్లీ మధ్య వందేభారత్‌ రైలును ప్రారంభించారు. ఇది ఉత్తరాఖండ్‌లోని తొలి వందేభారత్‌రైలు కావడంతో రూడ్కీ రైల్వేస్టేషన్‌లో ప్రజలు రైలుకు ఘనస్వాగతం పలికారు. రైల్వేశాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌ నుంచి దిల్లీ మధ్య వందేభారత్‌ రైలును ప్రారంభించారు. ఇది ఉత్తరాఖండ్‌లోని తొలి వందేభారత్‌రైలు కావడంతో రూడ్కీ రైల్వేస్టేషన్‌లో ప్రజలు రైలుకు ఘనస్వాగతం పలికారు. రైల్వేశాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
16/29
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా క్వాలిఫయర్‌-2 కోసం గుజరాత్‌, ముంబయి జట్ల మధ్య అహ్మదాబాద్‌లో శుక్రవారం మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా గుజరాత్‌ ఆటగాళ్లతో అభిమానులు ఆటోగ్రాఫ్‌, సెల్ఫీలు తీసుకుంటున్న ఫొటోలను జీటీ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ‘అభిమాన ఆటగాళ్లను కలిసే అవకాశం రావడం చాలా అదృష్టం’ అని ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా క్వాలిఫయర్‌-2 కోసం గుజరాత్‌, ముంబయి జట్ల మధ్య అహ్మదాబాద్‌లో శుక్రవారం మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా గుజరాత్‌ ఆటగాళ్లతో అభిమానులు ఆటోగ్రాఫ్‌, సెల్ఫీలు తీసుకుంటున్న ఫొటోలను జీటీ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ‘అభిమాన ఆటగాళ్లను కలిసే అవకాశం రావడం చాలా అదృష్టం’ అని ట్వీట్‌ చేసింది.
17/29
ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.
18/29
తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌.. మంత్రులు, కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రులు, అధికారులతో కలిసి ఆయన ఇలా గ్రూప్‌ ఫొటో దిగారు. తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్‌.. మంత్రులు, కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రులు, అధికారులతో కలిసి ఆయన ఇలా గ్రూప్‌ ఫొటో దిగారు.
19/29
ఝార్ఖండ్‌లోని ఖుంతిలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె.. అక్కడి చిన్నారులను ముద్దు చేయడంతో పాటు మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. ఝార్ఖండ్‌లోని ఖుంతిలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె.. అక్కడి చిన్నారులను ముద్దు చేయడంతో పాటు మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను పరిశీలించారు.
20/29
నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అభిమానులు, ప్రజలు ఆయనతో సెల్ఫీలు తీసుకొని సంబరపడ్డారు. లోకేశ్‌ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అభిమానులు, ప్రజలు ఆయనతో సెల్ఫీలు తీసుకొని సంబరపడ్డారు. లోకేశ్‌ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
21/29
దక్షిణ కొరియాలోని పోచియాన్‌లో దక్షిణ కొరియా-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన దక్షిణ కొరియా డ్రోన్లు, యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దక్షిణ కొరియాలోని పోచియాన్‌లో దక్షిణ కొరియా-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన దక్షిణ కొరియా డ్రోన్లు, యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
22/29
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన‌ రాగి రేకులు అమర్చేందుకు 2021 సెప్టెంబ‌రు 14న ప‌నులు ప్రారంభించారు. ప్రస్తుతం విమాన గోపురం ప‌నులు పూర్తి కావ‌డంతో జీర్ణోద్ధ‌ర‌ణ, మ‌హాసంప్రోక్ష‌ణ చేపట్టారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన‌ రాగి రేకులు అమర్చేందుకు 2021 సెప్టెంబ‌రు 14న ప‌నులు ప్రారంభించారు. ప్రస్తుతం విమాన గోపురం ప‌నులు పూర్తి కావ‌డంతో జీర్ణోద్ధ‌ర‌ణ, మ‌హాసంప్రోక్ష‌ణ చేపట్టారు.
23/29
జడ్చర్లలో నేడు నిర్వహించనున్న సభ కోసం హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుక్కు హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే తదితరులు స్వాగతం పలికారు. జడ్చర్లలో నేడు నిర్వహించనున్న సభ కోసం హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుక్కు హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే తదితరులు స్వాగతం పలికారు.
24/29
ఫ్రాన్స్‌లో నిర్వహిస్తున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదితిరావు హైదరీ, సన్నీలియోన్‌ మెరిశారు. ఫ్రాన్స్‌లో నిర్వహిస్తున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదితిరావు హైదరీ, సన్నీలియోన్‌ మెరిశారు.
25/29
ఆకాశ్ మధ్వాల్‌ బుధవారం లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో 5పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ, మధ్వాల్‌ కలిసి ఉన్న ఈ ఫొటోను ముంబయి జట్టు తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ఆకాశ్ మధ్వాల్‌ బుధవారం లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో 5పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ, మధ్వాల్‌ కలిసి ఉన్న ఈ ఫొటోను ముంబయి జట్టు తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.
26/29
కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి ఆయన అనుచరులు పెద్దఎత్తున వస్తున్న నేపథ్యంలో ఆసుపత్రి మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అంబులెన్స్‌లను చుట్టూ తిప్పి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మీ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి ఆయన అనుచరులు పెద్దఎత్తున వస్తున్న నేపథ్యంలో ఆసుపత్రి మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో అంబులెన్స్‌లను చుట్టూ తిప్పి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
27/29
చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌పై ముంబయి ఇండియన్స్‌ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో స్టేడియంలో ఓ అభిమాని సూర్యకుమార్‌ యాదవ్‌ను జెర్సీ అడగ్గా.. ఆయన ఇలా పైకి విసిరాడు. దీంతో అభిమాని సంబరపడ్డాడు. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌పై ముంబయి ఇండియన్స్‌ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో స్టేడియంలో ఓ అభిమాని సూర్యకుమార్‌ యాదవ్‌ను జెర్సీ అడగ్గా.. ఆయన ఇలా పైకి విసిరాడు. దీంతో అభిమాని సంబరపడ్డాడు.
28/29
తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డులో బుధవారం జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్‌తో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డులో బుధవారం జరిగిన బస్సు ప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్‌తో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు.
29/29
 తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.

మరిన్ని