బతుకునిచ్చిన అమ్మ

దసరా నవరాత్రులను శిష్ట జనులు మంత్రపూర్వకంగా, ఉపాసనా రీతిలో జరిపితే, జానపదులు ఆటపాటలతో జరుపుకుంటారు. బతుకమ్మ పండుగకు నవరాత్రి ఉత్సవాలకు దగ్గరి సంబంధం ఉందని చెప్పే ఓ గాథ

Updated : 07 Oct 2021 05:17 IST

దసరా నవరాత్రులను శిష్ట జనులు మంత్రపూర్వకంగా, ఉపాసనా రీతిలో జరిపితే, జానపదులు ఆటపాటలతో జరుపుకుంటారు. బతుకమ్మ పండుగకు నవరాత్రి ఉత్సవాలకు దగ్గరి సంబంధం ఉందని చెప్పే ఓ గాథ ప్రచారంలో ఉంది. మహిషాసురునితో యుద్ధం చేసి దుర్గాదేవి అలసిపోయి, సుప్తావస్థలోకి వెళ్లింది. ఆమెను సేదతీర్చి తిరిగి యథా స్థితికి తీసుకుని రావడానికి స్త్రీలు సేవలు చేసి పాటలు పాడగా తొమ్మిదో రోజుకు ఆమె అలసట తీరింది. కర్తవ్యాన్ని నిర్వహించింది. జగన్మాతగా జీవితాన్నీ, బతుకునూ ప్రసాదించిందని ‘బతుకమ్మ’ అన్నారు.

మరో కథనమూ ఉంది. దక్ష ప్రజాపతి వల్ల అవమానం పొందిన సతీదేవి అగ్నికి ఆహుతైతే, ఆగ్రహించిన శివుడు వీరభద్రుడనే గుణాన్ని సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. యజ్ఞగుండంలో మసైపోయిన దేవిని బతికించుకునేందుకు పసుపులో ఆకారం సృష్టించి బతుకమ్మగా ఆరాధించారనేది జానపదుల కథనం.

- హైందవి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని