అవే దుఃఖ హేతువులు...

ఒకరోజు ఒక అంధుడైన బౌద్ధ భిక్షువు బుద్ధుని చూడటానికి వచ్చాడు. అప్పుడతని పాదాల కింద కొన్ని కీటకాలు పడి చనిపోయాయి. అది చూసిన ఆయన శిష్యులు భిక్షువు జీవహింస చేశాడంటూ చిలవలు పలవలుగా చెప్పారు.బుద్ధుడు నవ్వి ‘అతనికి కళ్లు లేవు కనుక అలా జరిగింది. తెలియక చేసిన హింస పాపం కిందకు రాదు’ అన్నాడు.

Updated : 14 Oct 2021 05:44 IST

కరోజు ఒక అంధుడైన బౌద్ధ భిక్షువు బుద్ధుని చూడటానికి వచ్చాడు. అప్పుడతని పాదాల కింద కొన్ని కీటకాలు పడి చనిపోయాయి. అది చూసిన ఆయన శిష్యులు భిక్షువు జీవహింస చేశాడంటూ చిలవలు పలవలుగా చెప్పారు.

బుద్ధుడు నవ్వి ‘అతనికి కళ్లు లేవు కనుక అలా జరిగింది. తెలియక చేసిన హింస పాపం కిందకు రాదు’ అన్నాడు.

దానికి శిష్యులు ‘అదేమిటి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా’ అన్నారు సందేహంగా.

‘అందులో అనుమానం లేదు’ అన్నాడు బుద్ధుడు. శిష్యులు అయోమయంగా చూశారు.

బుద్ధుడు తల పంకించి, ‘ఆ భిక్షువు గత జన్మలో పేరు మోసిన కంటి వైద్యుడు. కానీ ఒకరోజు కోపావేశంతో ఒక రోగికి కావాలనే చూపు పోయేట్టు చేశాడు. ఆ పాపకార్యం ఫలితంగా ఎన్నోసార్లు గుడ్డివాడై పుట్టాడు. ఇది అతడి చివరి జన్మ. మనసు అన్ని రకాల వికారాలకూ కేంద్ర బిందువు. దానిని ఈర్ష్య, అసూయ, కోపం, మదం, మాత్సర్యం, లోభం అనే గుణాలతో మలినం చేసుకోకూడదు. అలాంటి మలిన మనసుతో చేసే పనులు జన్మజన్మలకూ దుఃఖ హేతువులు అవుతాయి. ఈ అంధ భిక్షువే అందుకు నిదర్శనం’ అంటూ శాంతంగా వివరించాడు.

శిష్యులు మరో కొత్త సత్యాన్ని గ్రహించి ఆనందపడ్డారు.

- చల్లా జయదేవ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని