కూలీ రీతి.. రైతు నీతి

ఒక సన్నకారు రైతు దగ్గర ఓ కూలీ పనిచేస్తున్నాడు. అతనికోరోజు రైతుతో మాట తేడా రావడంతో అలిగి వెళ్లిపోయాడు. తనకు రావాల్సిన పైకం కూడా తీసుకోలేదు. రైతు తన పొలంలో పెట్టుబడికి ఆ కూలీవాని

Updated : 18 Nov 2021 05:16 IST

ఒక సన్నకారు రైతు దగ్గర ఓ కూలీ పనిచేస్తున్నాడు. అతనికోరోజు రైతుతో మాట తేడా రావడంతో అలిగి వెళ్లిపోయాడు. తనకు రావాల్సిన పైకం కూడా తీసుకోలేదు. రైతు తన పొలంలో పెట్టుబడికి ఆ కూలీవాని డబ్బును కూడా వినియోగించాడు. ఆ ఏడాది పంట దిగుబడి పెరిగింది. లాభాలు రెట్టింపయ్యాయి. కూలీ వాటాలోంచి పైసా ఖర్చుపెట్ట కుండా భద్రపరిచాడు రైతు. అలా కొన్నేళ్లు గడిచాయి. కూలీ ఆర్థిక ఇబ్బందులతో తనకు రావాల్సిన డబ్బు ఇవ్వమంటూ రైతు దగ్గరకొచ్చాడు. అప్పుడు రైతు ‘ఇదిగో ఈ మేకలు, ఆవులను తోలుకుని వెళ్లు. ఆ తోట కూడా నీదే’ అన్నాడు. కూలీ ఆ మాటలు నమ్మలేకపోయాడు. తనను ఎగతాళి చేస్తున్నాడు అనుకుని ‘కూలీ ఇవ్వండి చాలు’ అన్నాడు. తను చెప్పేదంతా నిజమేనని వివరించాడు రైతు. ఇదంతా అతనికి తానివ్వాల్సిన కూలీ డబ్బును పెట్టుబడి పెట్టగా వృద్ధి చెందిందేనని, అతనికే చెందుతుందని చెప్పి, చిల్లిగవ్వతో సహా లెక్కకట్టి ఇచ్చాడు రైతు. కూలీ ఆనందిస్తోంటే, ‘నేనెన్నడూ నీతీ నిజాయితీలను ఉల్లంఘించను, అలా చేస్తే అల్లాహ్‌ క్షమించడు’ అన్నాడు రైతు.

- ముహమ్మద్‌ ముజాహిద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని