అణచుకోవటం కాదు అధిగమించాలి...

స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగిస్తున్నప్పుడు ఓ విదేశీయుడు ‘స్వామీజీ! ఈ ప్రాపంచిక సుఖాలను అణుచు కుంటే వ్యక్తిత్వం వికసిస్తుందా? జీవితంలో విజయాన్ని సాధించడం ఎలా?’ అనడిగాడు.

Published : 18 Aug 2022 01:16 IST

స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగిస్తున్నప్పుడు ఓ విదేశీయుడు ‘స్వామీజీ! ఈ ప్రాపంచిక సుఖాలను అణుచు కుంటే వ్యక్తిత్వం వికసిస్తుందా? జీవితంలో విజయాన్ని సాధించడం ఎలా?’ అనడిగాడు. వివేకానంద నవ్వి ‘మిత్రమా! వాంఛల్ని అణచుకోవటం కాదు, అధిగమించటం విజయం. అదే కోరికలపై శాశ్వత ఆధిపత్యం. ప్రాపంచిక భోగాల్ని, బాధల్ని అధిగమించటం వల్ల అవి ఇసుకరేణువుల్లా తోస్తాయి. కానీ అణచేయడం వల్ల భవిష్యత్తులో, మనసు బలహీనం అయినప్పుడు వేయింతల శక్తితో, రెట్టింపు ప్రభావాన్నీ, ప్రతాపాన్నీ చూపుతాయి. కనుక విచక్షణతో వాటి పరిధిని మించి ఎదగాలి. అదే నిజమైన విజయం, వికాసం’ అన్నారు.

- చైతన్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని