అష్టమి కష్టదినమా!

మనలో చాలామందికి అష్టమి తిథి మంచిది కాదనే అభిప్రాయం ఉంది. కానీ ‘అష్టమి వ్యాధి నాశినీ’ అనేది ప్రసిద్ధ వాక్యం. అంటే అష్టమి తిథి నాడు అనారోగ్యంతో వైద్యుని సంప్రదించినా, ఔషధాన్ని సేవించినా సత్వరం

Updated : 18 Aug 2022 05:27 IST

నలో చాలామందికి అష్టమి తిథి మంచిది కాదనే అభిప్రాయం ఉంది. కానీ ‘అష్టమి వ్యాధి నాశినీ’ అనేది ప్రసిద్ధ వాక్యం. అంటే అష్టమి తిథి నాడు అనారోగ్యంతో వైద్యుని సంప్రదించినా, ఔషధాన్ని సేవించినా సత్వరం శుభ ఫలితం కలుగుతుందని ‘చరక సంహిత’ చెబుతోంది. మరి అష్టమినాడు పుట్టిన కృష్ణుడు ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడు అనేది మరో సందేహం. నిజానికి అష్టమి ఎనిమిది శక్తుల సమ్మేళనం. అవే అష్ట భార్యల రూపంలో కన్నయ్యను వరించి కాపాడాయి. అలాగే అష్టమి తిథి దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది అంటారు. ఎందరు రాక్షసులు మట్టుబెట్టాలని చూసినా నల్లనయ్య ఆయువు అష్టమి తిథి అంత గట్టిదైనందునే శ్రీహరి చిద్విలాసంగా ఉండగా, వారంతా హరీ అన్నారు. ఒక్క అష్టమి అనే కాదు, ప్రతీ తిథీ మంచిదే. అయితే ఆ రోజును మనకు అనుగుణంగా మలచుకుంటేనే అది సత్ఫలితాన్ని ఇస్తుంది. కృష్ణుడు చేసి చూపిందీ, మనం అర్థం చేసుకుని ఆచరించాల్సిందీ ఇదే.

- ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని