భగవంతుడికి ఆవులెందుకు?

ఎప్పట్లాగే ప్రయాణిస్తున్న మహావీర్‌ ఓ చెట్టు దగ్గర ఆగి ధ్యానం చేయసాగాడు. ఇంతలో ఓ పశువుల కాపరి వచ్చాడు. తన ఆవులను ఎవరైనా చూసుకుంటే బాగుండుననుకున్నాడు. ఆవులకు కాపలా ఉండమన్నాడు మహావీర్‌ని. ఆయనేమీ

Published : 14 Apr 2022 01:40 IST

నేడు మహావీర్‌ జయంతి
ప్రబోధ

ఎప్పట్లాగే ప్రయాణిస్తున్న మహావీర్‌ ఓ చెట్టు దగ్గర ఆగి ధ్యానం చేయసాగాడు. ఇంతలో ఓ పశువుల కాపరి వచ్చాడు. తన ఆవులను ఎవరైనా చూసుకుంటే బాగుండుననుకున్నాడు. ఆవులకు కాపలా ఉండమన్నాడు మహావీర్‌ని. ఆయనేమీ బదులివ్వకున్నా, తన మాటలు వినే ఉంటాడని ఆవులను వదిలి తన మానాన వెళ్లాడు. కొన్ని గంటల తర్వాత తిరిగొచ్చి చూస్తే అక్కడ ఆవులు లేవు. దాంతో కోపంగా ‘నా ఆవులని ఏం చేశావు, వాటిని ఎక్కడ దాచావు?’ అంటూ అరిచాడు. మహావీర్‌ బదులివ్వలేదు, ధ్యానంలోనే ఉన్నాడు. 

పశువుల కాపరి చుట్టుపక్కలంతా గాలించినా ఆవులు దొరకలేదు. వెనుతిరిగి రాగా అవక్కడే ఉన్నాయి. దాంతో అతడికి మరింత కోపమొచ్చి ధ్యానంలో మునిగి ఉన్న మహవీర్‌ని తాడుతో కొట్టబోయాడు. అప్పుడు ఆకాశంలోంచి ఓ దేవత ప్రత్యక్షమై, ‘మహావీరుడు ధ్యానంలో ఉన్నాడు, కనిపించడంలేదా?’ అంది. 

‘కానీ, అతను నన్ను మోసం చేశాడు’ అన్నాడతడు బింకంగా. ‘భగవంతుడికి నీ ఆవులెందుకు? ఆయన ధ్యానానికి భంగం కలిగించకుండా ఇక్కణ్ణించి వెళ్లు’ అంటూ అంతర్థానమైంది దేవత. తన తొందరపాటుకు బాధపడుతూ మహావీరుని క్షమాపణ కోరాడతను          

- ఎం.ఎన్‌.బొగ్గరపు వెంకటేష్‌ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని