ఆలయానికి వెన్నెముక

ఆలయ నిర్మాణంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన అత్యంత ప్రధానమైనది. ఆలయం సాధకుని దివ్యదేహానికి ప్రతీక. దేహమే దేవాలయం అన్నారు పెద్దలు. దేహానికి వెన్నెముక వంటిదే ఆలయానికి ధ్వజస్తంభం.....

Published : 03 May 2018 01:13 IST

ధర్మ సందేహం
ఆలయానికి వెన్నెముక

* దేవాలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు ఏర్పాటు  చేస్తారు?

- ప్రసన్న అనంతపురం

లయ నిర్మాణంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన అత్యంత ప్రధానమైనది. ఆలయం సాధకుని దివ్యదేహానికి ప్రతీక. దేహమే దేవాలయం అన్నారు పెద్దలు. దేహానికి వెన్నెముక వంటిదే ఆలయానికి ధ్వజస్తంభం. ఆగమ సంప్రదాయం ప్రకారం దైవశక్తి ఐదు రూపాల్లో.. ఐదు చోట్ల ఉంటుంది. మూలవిరాట్టులో, ఉత్సవ మూర్తిలో, పాదుకలలో, అర్చకునిలో, ధ్వజస్తంభంలో దైవశక్తి ఉంటుంది. కనుక ఆలయంలో ధ్వజస్తంభం ఉండితీరాలి. దూరం నుంచి వచ్చే భక్తులకు ఆలయం ఎక్కడ ఉన్నదో సూచిస్తుందిది. అంతేకాదు, భక్తులు ఆలయానికి చేరేసరికి.. వేళదాటి ఆలయం ద్వారాలు మూసివేస్తే దిగులు పడనవసరం లేకుండా ధ్వజస్తంభ దర్శనంతో దైవదర్శనం పొందిన ఫలితం వస్తుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని మనపెద్దలు ఆలయాల్లో ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని